White Ration Card Update: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు శుభవార్త అందించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజలకు రేవంత్ సర్కార్ ఆమోదం పలికింది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించిన మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెల్ల రేషన్ కార్డులపై సీఎం నిర్ణయం..
కొత్త రేషన్‌కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పవచ్చు.రేషన్‌కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 12న జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు వచ్చే రేషన్ కార్డులు ఎవరికీ అందుతాయి?అర్హత ప్రమాణాలు ఏంటి అనే విషయం అందరిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రేషన్ కార్డులపై వచ్చిన తాజా వార్త ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా అన్ని పథకాలకు రేషన్ కార్డులు తప్పనిసరి చేసింది. పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు అందేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు.
అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు..
నివేదికల ప్రకారం, ప్రజా పరిపాలన కార్యక్రమం కింద 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పరిశీలన పూర్తి అయిన తర్వాత, ఫిజికల్ వెరిఫికేషన్ చేపడతారు. తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులో ఎవరు అనర్హులో నిర్దారణ జరిగిన తర్వాత మాత్రమే అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తారు. అది కూడా జిల్లా కలెక్టర్ మరియు రేషన్ సిబ్బంది పర్యవేక్షణలోనే జరుపుతారు.
వీరికి రేషన్ కార్డులు రావు..
ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, కారు ఉన్నవారికి, సొంత ఇల్లు కలిగిన వారికి మరియు ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు కారు. ఎవరైతే దారిద్య రేఖకు దిగువున ఉంటారో వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో దరఖాస్తుదారులు అందించే సమాచారం నిజామా కదా అని తెలుసుకోవాలి సీఎం ఆదేశించారు.
అర్హత ఉన్నా రేషన్ కార్డులు లేవు..
కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి. అందువల్ల రేషన్ కార్డులు లేని వారు తమకు అర్హత ఉన్నప్పటికీ మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలు అందుకోలేకపోతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం రేషన్ కార్డులు త్వరగా జారీ చేయాలనీ చూస్తుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణి తొందరలోనే జరుగుతుందని అధికారులు తెలిపారు.
White Ration Card Update