Wind Chime : అందం, ఆహ్లాదం, ఆనందం, అదృష్టం తో పాటు ఆరోగ్యాన్నిచ్చే విండ్ చైమ్. ఈ దిశలో ఉంచితే ఇవన్నీ మీ సొంతం
ప్రతి మహిళ తమ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని కోరుకుంటుంటారు.కొన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ ఆ ఇంటికి ఒక నూతన కళను తీసుకువస్తాయి. ఈ డెకరేషన్ ఐటమ్స్ లోనే కొన్ని రకాల వస్తువులకు ఇంట్లో కి దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంచే శక్తి వాటికి ఉంటుంది. అటువంటి వస్తువులలో విండ్ చైమ్ ఒకటి.
ప్రతి మహిళ తమ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని కోరుకుంటుంటారు. దీనిలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్ ఏవో ఒకటి కొంటూ ఉంటారు. వాటిని తీసుకువచ్చి ఇంట్లో పెడుతుంటారు. కొన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ ఆ ఇంటికి ఒక నూతన కళను (A new art) తీసుకువస్తాయి. ఇటువంటివి పెట్టడం వల్ల ఇల్లు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.
అయితే కొన్ని రకాల వస్తువుల విషయంలో మాత్రం కొన్ని వాస్తు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉంచవలసిన స్థానంలో ఉంచి నట్లయితే ఆ ఇంట్లో సంతోషం మరియు సంపద వచ్చేలా చేస్తాయి.
అయితే ఈ డెకరేషన్ ఐటమ్స్ లోనే కొన్ని రకాల వస్తువులకు ఇంట్లో కి దుష్ట శక్తులు (Evil forces) దరిచేరకుండా ఉంచే శక్తి వాటికి ఉంటుంది.
అటువంటి వస్తువులలో విండ్ చైమ్ (Wind chime) ఒకటి. వీటిని ఇంట్లో ఉంచడం వలన అదృష్టం వచ్చేలా చేస్తాయి. వీటిని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీనిని విండ్ చైమ్ లేదా ఫెంగ్ షుయ్ అని కూడా పిలుస్తారు.వీటిని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
అంతేకాకుండా ఇంట్లో పురోగతి తో పాటు అదృష్టం (good luck) కూడా కలిసి వస్తుంది. వీటిని ఆఫీస్ మరియు షాపులలో కూడా ఉంచుకో ఉంచవచ్చు.
విండ్ చైమ్ ను ఇంట్లో ఏ దిశలో ఉంచాలో మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
విండ్ చైమ్ నుండి ఒక ప్రత్యేకమైన శబ్దం (A unique sound) వస్తుందన్న విషయం తెలిసిందే. దీనిని కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా ఇంటికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి. వీటిని ఇనుము లేదా కలప తో తయారు చేస్తారు. వీటిని ఇంటికి ఉత్తర దిశ లేదా పడమర దిశలో వ్రేలాడ దీస్తే ఆ ఇంట్లో శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే బంకమట్టితో (clay) చేసినవి అయితే ఇంటికి తూర్పు లేదా దక్షిణ దిశలలో వ్రేలాడదీయవచ్చు.
చాలామంది విండ్ చైమ్ బావుందని పెద్దవిగా ఉండేవి తీసుకుంటారు. అలా కాకుండా చిన్న పరిమాణంలో ఉన్న విండ్ చైమ్ తీసుకోవడం మంచిది.
Also Read : Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి
ఇల్లు లేదా ఆఫీసులలో ఒకే వరుసలో మూడు తలుపులు (Three Doors) ఉంటే మధ్య లో ఐదు రాడ్ లతో ఉన్న విండ్ చైమ్ ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారికి వ్యాధులు మరియు విపత్తుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
ఇంట్లోకి చెడు శక్తులు దరిచేరకుండా ఆపే శక్తి వీటికి ఉంటుంది. ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురావాలంటే ఏడు లేదా ఎనిమిది రాడ్ (Rod) లతో కూడిన విండ్ చైమ్ ను ఏర్పాటు చేసుకోవాలి.
కొంతమంది విండ్ చైమ్ ను బెడ్ రూమ్ లో కూడా ఉంచుతారు. ఈ విధంగా ఉంచడం వల్ల ఆ రూమ్ అందంగా ఉండడంతో పాటు, దంపతుల మధ్య ప్రేమ మరియు సాన్నిహిత్యం (Intimacy) కూడా పెరుగుతుంది. అయితే బెడ్ రూమ్ లో తొమ్మిది రాడ్ లతో ఉన్న విండ్ చైమ్ ను ఉంచాలి.
ఇంట్లో ఉన్నవారికి వ్యాధులు రాకుండా వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా (Healthy) ఉండాలంటే రెండు లేదా మూడు రాడ్ లతో ఉన్న విండ్ చైమ్ ను ఏర్పాటు చేసుకోవాలి.
Also Read : Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి
ఇంట్లో గొడవలు (quarrels) జరగకుండా ఉండాలంటే రెండు లేదా మూడు రాడ్ లతో ఉన్న విండ్ చైమ్ ను ఏర్పాటు చేయాలి. తద్వారా ఆ ఇంట్లో నివసించే వారికి ప్రశాంతత లభిస్తుంది.
కాబట్టి వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు అలాగే వాస్తు నియమాలను పాటించేవారు విండ్ చైమ్ ను ఇల్లు, షాపులు మరియు ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకోండి. తద్వారా శుభ ఫలితాలను పొందండి.
Comments are closed.