UPI Without Internet: ఇంటర్నెట్ లేకుండా కూడా నగదు లావాదేవీలు చెల్లించుకోవచ్చు, ఈ ప్రక్రియను ఇప్పుడే తెలుసుకోండి.

Telugu Mirror: ప్రపంచం అంతా టెక్నాలజీ సాయంతో నడుస్తున్న యుగంలో బ్రతుకుతుంది. ప్రతి పనిలోనూ సాంకేతిక వినియోగం తప్పనిసరి అయిన ఈ రోజులలో శ్రమ లేకుండా అవసరమైన పనులను చక్కబెట్టుకోవడంలో టెక్నాలజీ (technology) ఎంతో ఉపయోగకరంగా మారింది. బ్యాంకింగ్ కి సంబంధించిన విషయాలలో కూడా సాంకేతిక వినియోగం పెరిగింది.

బ్యాంక్ దాకా వెళ్ళకుండానే ఫోన్ లోనే కావలసిన పని చక్కబెడుతున్నారు. అలాగే ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా ఫోన్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఎటువంటి లావాదేవీలలో అయినా ఫోన్ చెల్లింపుల ద్వారా పనులు చక్కబెడుతున్నారు. టీ స్టాల్ (tea stall) లో రూ.10 అయినా పెద్ద షాపింగ్ మాల్ లో రూ.10,000 అయినా ఫోన్ చెల్లింపులే జరుగు తున్నాయి. కరోనా (corona virus) సమయంలో ఊపు అందుకున్న ఫోన్ లావాదేవీలు ఇప్పుడు అధికంగా వినియోగంలో ఉన్నాయి.

ఇప్పుడు ఏ విధమైన నగదు లావాదేవీలు అయినా ఫోన్ పే (phone pe), గూగుల్ పే(google pay), పేటియం(pay tm), క్రెడ్(cred)లను ఉపయోగించి చెల్లింపులు జరుగు తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన ప్రస్తుత పరిస్థితులలో ఒక్కోసారి ఇంటర్నెట్ వలన ఇబ్బంది కలుగుతుంది.

మీ బ్యాంక్ అకౌంట్ లో నగదు నిల్వలు ఉన్నా, ఫోన్ లో ఛార్జింగ్ ఉండి కూడా ఒక్కోసారి ఇంటర్నెట్ (internet) లేకుంటే నగదు ట్రాన్స్ ఫర్ చేయలేము. అన్నీ సవ్యంగా ఉండి నెట్ సమస్యవలన డిజిటల్ పేమెంట్ చేయలేని సందర్భంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలి అనేది తెలుసుకుందాం. ఫోన్ లో నెట్ బ్యాలన్స్ ఉన్నాగాని అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇకముందు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మొబైల్ ఫోన్‌లో ఒక్క సెట్టింగ్ చేసుకుంటే చాలు.. ఇంటర్నెట్ లేకున్నా.. యూపీఐ ద్వారా చెల్లింపులు యధాతథంగా జరపొచ్చు. మరి ఫోన్ సెట్టింగ్ లలో ఏ మార్పులు చేయాలి, దాన్ని ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంటర్నెట్ లేకున్నా కూడా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు చేసేందుకు *99# సేవలు ఉపయోగించుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో ఉంది. దేశంలోని 83 ప్రముఖ బ్యాంకులు ఈ సర్వీస్ అందిస్తున్నాయి. 4 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ సదుపాయం అందిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ తో పాటు దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ కు సంభందిచిన. అమరికను ఒకసారి చేసుకుంటే చాలు.. తర్వాత ఎప్పుడు అవసర పడినా ఆఫ్‌లైన్‌లోనే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.

With out internet also we can send money by using this technique
Image credit: UPI Payments

Whats App New Feature: వాట్సాప్ లో అదిరి పోయే ఫీచర్ మన ముందుకు, HD ఫొటోస్ సెండ్ చేయడానికి ఇక ఆలస్యమెందుకు

ఇలా సెట్ చేసుకోవచ్చు

మీరు డిజిటల్ లావాదేవీలు చేసే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు కాల్ చేయాలి.

తర్వాత మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోవాలి.

తర్వాత మీ బ్యాంక్ పేరు నమోదు చేయాలి.

మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాల జాబితా కనిపిస్తుంది.

ఏ అకౌంట్ నుంచి లావాదేవీలు జరగాలని భావిస్తున్నారో.. ఆ అకౌంట్ ని ఎంచుకోండి.

తర్వాత మీ Debit Card ఎప్పటివరకు ముగింపు ఉందో ఆ తేదీ,సంవత్సరం నమోదు చేయండి..దీంతోపాటు కార్డు నంబర్‌లోని చివరి 6 అంకెలను ఎంటర్ చేయండి. దీంతో సెట్టింగ్స్ సక్సెస్ చేసినట్లు.

పేమెంట్స్ ఎలా అంటే?

ఇంటర్నెట్ లేకుండా డబ్బులు ట్రాన్షక్షన్ చేయాలంటే ముందుగా మీ మొబైల్ నుండి *99# నంబర్‌కు కాల్ చేసి.. తర్వాత 1 నొక్కాలి.

తర్వాత ఎవరికి డబ్బు పంపించాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్/ UPI ID/ బ్యాంక్ అకౌంట్ నంబర్ నమోదు చేయాలి.

ఎంత డబ్బు పంపాలో నమోదు చేసి.. తర్వాత UPI పిన్ నంబర్ ఎంటర్ చేయాలి.

అంతే డబ్బులు విజయవంతంగా ట్రాన్స్ ఫర్ అవుతాయి.

ఈ ఆప్షన్‌తో ఒకసారి రూ. 5 వేల వరకు నగదు బదిలీ చేయవచ్చు.

అయితే *99# సర్వీస్ ను ఉపయోగించిన ప్రతిసారీ 50 పైసల ఛార్జీ చెల్లించాలి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in