ఆపిల్ ఐఫోన్ 15 రిలీజ్ తో భారీగా తగ్గిన iPhone 14 ధరలు ,ఊహించని డిస్కౌంట్ తో

With the release of Apple iPhone 15, the iPhone 14 prices have been greatly reduced, with an unexpected discount.
image credit : CNET

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆపిల్ మంగళవారం నూతన ఐఫోన్ 15 లైనప్ విడుదల చేసిన తరువాత ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ధరలను తగ్గించింది . మంగళవారం కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్ లో టిమ్ కుక్ ఆధ్వర్యం లోని కంపెనీ నాలుగు కొత్త ఐఫోన్‌లు – iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max లను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.

iPhone 14 మరియు iPhone 14 Plusపై తగ్గింపు:

Apple గత సంవత్సరం సెప్టెంబర్‌లో iPhone 14 ను రూ.79,900 ధరలోనూ అదేవిధంగా iPhone 14 Plus ను రూ. 89,900 ప్రారంభ ధరతో ప్రారంభించింది. అయితే, మంగళవారం తాజాగా కొత్త iPhone 15 సిరీస్‌ను ఆవిష్కరించిన తరువాత, ఐఫోన్ 14 మరియు 14 plus ఫోన్‌ల ధరలు ఇప్పుడు Apple యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పుకోదగిన స్థాయిలో తగ్గించబడ్డాయి.

 

iPhone 14 ధర ఇప్పుడు 128 GB డివైజ్ వచ్చేసి రూ. 69,900, అలాగే 256 GB వేరియంట్‌ ధర రూ. 79,900 మరియు 512 GBపరికరం రూ. 99,900 ధరలో ప్రస్తుతం అందుబాటులో ఉంది . మరోవైపు  iPhone 14 Plus 128 GB వేరియంట్‌కు రూ. 79,990, 256 GB పరికరం ధర వచ్చేసి రూ. 89,990 మరియు 512 GB డివైజ్ ధర రూ. 1,09,990 గా ఉన్నది.

ధర తగ్గింపు తోపాటు అదనంగా, వినియోగదారులు తమ కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వాడటం    వలన రూ. 8,000 వరకు అప్పటికప్పుడు తగ్గింపుకు అర్హులు .

With the release of Apple iPhone 15, the iPhone 14 prices have been greatly reduced, with an unexpected discount.
image credit : iiitl.ac .in

iPhone 15 స్పెసిఫికేషన్స్:

iPhone 14 Apple A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 128GB, 256GB మరియు 512GB నిల్వ సామర్ధ్యం కలిగిన ఎంపికలతో జోడించబడింది . సిరామిక్ షీల్డ్ సెక్యూరిటీ తోపాటు 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఐఫోన్ గేమింగ్ తో 6.1-  అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేని కలిగి వస్తుంది.  డ్యూయల్ కెమెరా సెటప్ లో బ్యాక్ సైడ్ 12MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది, మరొక 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో కలిపి వస్తుంది.

Also Read :రియల్‌మి 5G సేల్, ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఏ ఫోన్ ధర ఎంతంటే

సామాన్యుడికి అందుబాటు ధరలో Realme సరికొత్త స్మార్ట్ ఫోన్

Motorola G14 : అదిరిపోయే ఫీచర్స్ తో మోత మోగిస్తున్న మోటోరోలా,తక్కువ ధరతో అందుబాటులోకి..

Apple iPhone 14 Plus స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేని కలిగి ఉంది . ఈ హ్యాండ్ సెట్  Apple యొక్క A15 బయోనిక్ చిప్‌సెట్‌ పవర్ కలిగి వస్తుంది మరియు iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది . ఈ స్మార్ట్ ఫోన్ మూడు – 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఎంపికలలో అందించబడుతుంది .

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in