గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు సరైన మోతాదులో గుడ్డును తీసుకుంటే దానివల్ల శరీరానికి చాలా ఉపయోగాలు అందుతాయి. ఒక పెద్ద గుడ్డులో సుమారుగా 74 కేలరీలు ఉంటాయి. ఉడికించిన మూడు గుడ్లు, కూరగాయలు, అవకాడో ముక్కలతో కూడిన ఆహారం 500 క్యాలరీల కంటే తక్కువ కలిగి ఉంటుంది.
గుడ్లతో కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. గుడ్డులో ప్రోటీన్, క్యాల్షియం,ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రతిరోజు గుడ్డు తీసుకుంటే దానివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యమైన వ్యక్తులుగా ఉండవచ్చు.
కొన్నిసార్లు తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటాం. వాటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
గుడ్లతో ఏయే ఆహార పదార్థాలు కలిపి తినకూడదో తెలుసుకుందాం.
Also Read : World Egg Day 2023: ప్రపంచ గుడ్డు దినోత్సవం, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు నాంది, దీని కథేంటో తెలుసా
గుడ్డు అరటి పండు :
గుడ్డు మరియు అరటిపండు రెండిట్లో కూడా పోషకాలు మెండుగా ఉన్నాయి. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. కానీ రెండిటిని విడివిడిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో గొప్ప ప్రయోజనాలను అందించవచ్చు. ఈ రెండింటిని కలిపి తినకూడదని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. గుడ్డు మరియు అరటిపండును తినాలి అనుకుంటే రెండిటికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి.
గుడ్డు మరియు స్వీట్లు :
గుడ్డు తిన్న తర్వాత స్వీట్ తినకూడదు. చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తింటే కడుపుకు హాని కలుగుతుందని గుర్తించుకోవాలి. ఈ రెండిటి మధ్య కనీసం ఒక గంట సమయం ఉండేలా చూసుకోవాలి.
Also Read : EGGS : మితంగా తీసుకుంటే ఆరోగ్యం, మితిమీరితే అనారోగ్యం. పోషక నిలయం గుడ్డు లో మంచి,చెడు
గుడ్డు మరియు సోయా ఉత్పత్తులు :
సోయాబీన్ మరియు సోయా ఉత్పత్తుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ రెండు కలిపి ఒకే సమయంలో తినకూడదు. ఈ రెండిటి వల్ల శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్ అందుతుంది. కానీ ఈ రెండిటిని కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
గుడ్డు మరియు కెఫిన్ ఉన్న ఆహార పదార్థాలు :
కెఫిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత గుడ్లు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండిటి కలయిక వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అంతేకాకుండా కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు మరియు గుడ్డు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి లభించే పోషకాలు అందవు.ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి గుడ్డుతో ఇటువంటి ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…