Telugu Mirror : July 28న” ప్రపంచ హెపటైటిస్(Hepatitis) దినోత్సవం” గా జరుపుకుంటారు. దీనిని 2008 నుండి జరుపుకోవడం ప్రారంభించారు. ప్రజలలో అవగాహన తెలియజేయడం కోసం ఈ రోజున దీనిని జరుపుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీత మరియు శాస్త్రవేత్త డాక్టర్ బరూచ్ బ్లమ్ బెర్గ్(Baruch Blumberg) పుట్టినరోజును హెపటైటిస్ దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ హెపటైటిస్ బి వైరస్ ని ఆయన కనుగొన్నారు. చికిత్స కోసం పరీక్షలు మరియు వ్యాక్సిన్ కూడా డెవలప్ చేశారు .అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ లో దీనిని ఎదుర్కొనేందుకు సరైన చికిత్స కోసం ప్రభుత్వం మరియు ప్రజల భాగస్వామ్యంతో అవగాహన పెంచుతున్నారు.
ప్రతి ఏడాది హెపటైటిస్ దినోత్సవం నిర్వహించడానికి ఒక భిన్నమైన మరియు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2023 యొక్క నినాదం ఏమిటంటే” మేము వేచి ఉండటం లేదు” .అనగా హెపటైటిస్ వైరస్ ఎక్కువ అయ్యేవరకు ఉండకుండా వ్యాధికి వెంటనే చికిత్స తీసుకోవాలి అన్న ఉద్దేశం.హెపటైటిస్ చికిత్స లేటు అవ్వడం వలన జాండీస్ మరియు సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది
Vande Bharat: రైల్వేశాఖ నిర్లక్ష్యం- రోటీలలో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!
హెపటైటిస్ లో ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ – ఏ, బి, సి, డి, ఇ ఇలా ఐదు రకాలు ఉన్నాయి .హెపటైటిస్ వ్యాధి అనేక కారణాల వల్ల రావచ్చు .రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం మరియు మత్తుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది .మరియు వర్షాకాలంలో ఈ హెపటైటిస్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
హెపటైటిస్ వ్యాధి డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్ వలన కాలేయంలో మంట వస్తుంది. ఎక్కువ మంది ప్రజలు హెపటైటిస్ మరియు మధుమేహానికి ప్రభావితం అవుతున్నారు .ఇండియాలో హెపటైటిస్ బి బారిన పడిన వారి సంఖ్య సుమారు 40 మిలియన్ అలాగే హెపటైటిస్ సి బారినపడినవారు 12 మిలియన్లు ఉన్నారు. హెపటైటిస్ ఉన్నవారికి డయాబెటిస్ మరియు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.హెపటైటిస్ బి మరియు సి రెండు కూడా కలుషితమైన రక్తం ద్వారా వస్తుంది .హెపటైటిస్ ఎ మరియు ఇ కలుషితమైన ఆహారం వల్ల వస్తుంది .హెపటైటిస్ ఎ మరియు ఇ మధుమేహం ఉన్న వారికి త్వరగా వస్తుంది.డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు హెపటైటిస్ బి మరియు సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
Ola S1 Air:ఆకట్టుకునే ధర , ఆకర్షణీయమైన ఫీచర్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మీ కోసం..
హెపటైటిస్ రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి:..
1.మీరు రేజర్ ,ఇంజక్షన్ సూది మరియు టూత్ బ్రష్ ఇతరులతో షేర్ చేయకూడదు.
2. పచ్చబొట్టు( Tatoo )వేయించుకునేటప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో వేస్తున్నారో లేదో తెలుసుకోవాలి .
3. చెవులు కుట్టే పరికరాలు ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి
4.ఒకసారి వాడిన సిరంజి మళ్లీ వాడకూడదు.
5. గర్భధారణ సమయంలో డాక్టర్ తో పూర్తిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి.
ఇది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…