Yellow Alert In Telangana: ఎండలు మండిపోతున్నాయి. ఒక పక్క ఎండలు మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవడంతో ప్రజలు తీవ్ర వేడిని గురవుతూ ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఎండలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ఐఎండీ-హైదరాబాద్ (imd hyderabad) ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఐఎండీ హైదరాబాద్ యెల్లో నోటీసు (Hyderabad Yellow Notice) జారీ చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణాలో వర్షాలు :
తెలంగాణ ప్రజలకు శుభవార్త. చాలా రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న వారికి ఐఎండీ శుభవార్త అందించింది. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది.
ఈరోజు నల్గొండ (Nalgonda) , వరంగల్ (Warangal) , హనుమకొండ (Hanumakonda) , జనగామ (Janagam) , సిద్దిపేట (Siddipet) , యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. శనివారం ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. మరోవైపు జూన్ 2న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది.
Also Read:Cyclone in Telangana: మరో 4 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు, ఆ తర్వాత తెలంగాణే!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు :
తెలంగాణలో 47 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల్‌లో 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో 46 డిగ్రీలకు చేరుకుంది. రాష్ట్రంలోని దాదాపు 15 ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.