Telugu Mirror : ఆధునిక కాలాన్ని నిర్వచించాలంటే స్మార్ట్ ఫోన్(Smart Phone) కు ముందు స్మార్ట్ ఫోన్ కి తరువాత గా చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత ప్రపంచాన్నే కళ్ళకు ఎదురుగా పెట్టాయి.అలా స్మార్ట్ ఫోన్ ల ద్వారా వచ్చిందే యూట్యూబ్.యూట్యూబ్ నేడు విరివిగా వాడుతూ ఉన్న మొబైల్ యాప్. చాలా మంది ప్రజలు తమ ప్రయాణాలు లేదా ఖాళీ సమయాలలో YouTube చూస్తారు. కావలసిన సమాచారమే కాకుండా వాటి తాలూకూ ప్రత్యక్ష ప్రసారాలు ఇలా ఎన్నో విషయాలు యూట్యూబ్(Youtube) ద్వారా వినేవి,నేర్చుకునేవి అన్నీ ఉంటాయి యూట్యూబ్ లో. అభిమానాన్ని చూశారు.
ప్రతి విషయం గురించి తెలుసుకోవడానికి YouTube అద్భుతమైనది. అయితే ఎక్కువ మంది యూట్యూబర్‌లు వారి వీడియోలు చూడాలంటే వారిని సబ్‌స్క్రయిబ్(Subscribe) చేసుకోవాలి. సబ్ స్క్రైబ్ చేయాలంటే డబ్బు చెల్లించాలి.డబ్బు ఖర్చు కారణంగా, అనేక మంది ఆ మార్గానికి దూరంగా ఉంటారు. అయితే తక్కువ ధరకు 3 నెలల YouTube ప్రీమియం మెంబర్ షిప్(MemberShip) ఎలా పొందాలో మీకు తెలుసా? అందుకు కొన్ని విధానాలను పాటించండి.మీ స్మార్ట్ ఫోన్లో YouTube ని తెరచి ప్రొఫైల్ క్లిక్ చేయండి.
YouTube ‘ప్రీమియం పొందండి’ని సెలక్ట్ చేసుకోండి. ఉచిత 3-నెలల డీల్‌ని ఎంచుకోండి. 3-నెలల ఫ్రీ మెంబర్ షిప్(Free Membership) పై నొక్కండి.ఇప్పుడు మీరు అక్కడ బ్యాంకు యొక్క వివరాలను సమర్పించాలి. బ్యాంక్ వివరాలను అందించిన తరువాత మీరు 3 నెలల ఉచిత ప్రీమియం ను పొందుతారు, ఫ్రీగా. అయితే మీరు ఉచితంగా పొందిన సబ్ స్క్రిప్షన్ ను మూడు నెలల లోపు తొలగించాలి.
లేకపోతేమీ బ్యాంకు ఖాతా నుండి పైసలు మినహాయింపు అవుతాయి. భారతదేశంలో ప్రీమియం యొక్క మూడు నెలల సభ్యత్వం రూ. 399.మీరు ఏమి పొందుతారు? YouTube Premium ఇతర ప్లాట్ ఫారమ్ ల కంటే మెరుగైన ఆడియో స్ట్రీమింగ్(Audio Streaming) అనుభవాన్ని అందిస్తుందని నివేదించబడింది. మీరు YouTube లో సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు. YouTubeలోని ప్రతిదీ ప్రకటనలు లేకుండా చూడవచ్చు.