Zero Balance: RBI గుడ్ న్యూస్, ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకున్నా నో పెనాల్టీ!
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉపశమనం కల్పించింది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని స్పష్టం చేసింది.
Zero Balance: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా తెరవడానికి డబ్బు అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే, చాల మంది తమ జీరో బ్యాలెన్స్ (Zero Balance) మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance)ను కలిగి ఉండరు. ఇలా తమ బ్యాంక్ ఖాతాలో మైనస్ బ్యాలెన్స్ (Minus Balance) ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు ఉంచితే అంత పెద్ద మొత్తంలో నగదు పెనాల్టీ పడుతుంది. ఈ తరుణంలో ప్రజలు తమ ఖాతాను రద్దు చేయడానికి ప్రయత్నించే వరకు పెనాల్టీ (Penalty) గురించి వాళ్ళకి తెలియదు.
అప్పటికి అది పెద్ద మొత్తంలో జమ అవుతుంది. బ్యాంకులు విధించిన మొత్తాన్ని మీరు చెల్లించాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ పాలసీ (Reserve Bank Policy) పేర్కొంది. RBI మార్గదర్శకాల ప్రకారం, మీరు నెగిటివ్ బ్యాలెన్స్ (Negative Balance) కలిగి ఉన్నప్పటికీ, మీ ఖాతాలో జమ చేయబడిన మైనస్ మొత్తానికి మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఇకపై మీ బ్యాంక్ ఖాతా అవసరం లేకపోతే, మీరు దాన్ని ఉచితంగా మూసివేయవచ్చు. దీని కోసం బ్యాంకులు మీకు ఛార్జీ విధించవు. చాలా బ్యాంకులు ఖాతా మూసివేసేటప్పుడు అప్పటి వరకు ఉన్న పెనాల్టీ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది.
Also Read:Saving Account : మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండొచ్చో తెలుసా ? లిమిట్ దాటితే ఇక అంతే సంగతులు.
మీరు RBIకి ఫిర్యాదు చేయవచ్చు.
మీ ఖాతాను మూసివేసినందుకు ఏదైనా బ్యాంకు జరిమానా విధించినట్లయితే, మీరు RBIకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రాసెస్ చేయడానికి bankingombudsman.rbi.org.inకి వెళ్లి మీ ఫిర్యాదును ఫైల్ చేయండి. ఇది కాకుండా, ఫిర్యాదులను RBI యొక్కహెల్ప్ లైన్ నంబర్‌కు పంపవచ్చు. దీని తరువాత, ఆ బ్యాంకుపై RBI చర్యలు తీసుకుంటుంది. మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ వసూలు చేయరాదని రిజర్వ్ బ్యాంక్ చెబుతున్నప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే అమలు చేస్తున్నాయని, మరికొన్ని పెనాల్టీ ఖర్చులను వసూలు చేస్తున్నాయని తెలుస్తోంది.
Comments are closed.