Telugu Mirror : ఫిక్సెడ్ డిపాజిట్ల వైపు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు మదుపరులు.గత సంవత్సరం నుండి ఫిక్సెడ్ డిపాజిట్ (FD) పై వడ్డీ రేట్లు వడిగా పెరిగాయి. బడా బ్యాంకులను వదిలేస్తే చాలా చిన్న బ్యాంక్ లలో కూడా ఫిక్సెడ్ డిపాజిట్ ల మీద 9 శాతం వరకు వడ్డీ రేట్లను కలిగి ఉన్నాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన చిన్నా పెద్దా తేడా లేకుండా FD లలో పెట్టుబడి పెడుతున్నారు. ఫిక్సెడ్ డిపాజిట్ ల ద్వారా గ్యారంటీ రాబడిని కలిగి ఉండి ప్రయోజనాలను పొందుతారు. 4 బ్యాంక్ లు మూడు సంవత్సరాలలో కాలపరిమితి ముగిసే ఫిక్సెడ్ డిపాజిట్ ల మీద అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD పై వడ్డీ రేటు :
ఈక్విటాస్ సూక్ష్మ ఫైనాన్స్ బ్యాంక్ వారు ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేటు 889 రోజుల నుండి 1095 రోజుల (3సంవత్సరాలు)మధ్యన కాల పరిమితి ముగిసే డిపాజిట్ లమీద 8 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.అదే కాల పరిమితిలో ముగిసే ఫిక్స్ డ్ డిపాజిట్ లు కలిగి ఉన్న సీనియర్ సిటిజన్ లకు ఈ బ్యాంక్ 8.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.
Fixed Deposite Rates : FD ల మీద 3 సంవత్సరాలకు 9% వడ్డీ రేటును ఇచ్చే 4 బ్యాంక్ లు..
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD మీద వడ్డీ రేటు :
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ ల మీద 1001 నుండి 1095 రోజుల మధ్య (3సంవత్సరాలు) కాల పరిమితి ముగిసిన ఫిక్స్ డ్ డిపాజిట్ లకు 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే, సీనియర్ సిటిజన్ లకు అదే కాల పరిమిత లో FD లపై 8.6 శాతం వడ్డీ రేటును ఇస్తున్నారు.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD లపై వడ్డీ రేటు:
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1000 రోజుల నుండి 1500 రోజుల మధ్యన కాలపరిమితి ముగిసి మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ల మీద 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.సీనియర్ సిటిజన్ లకు అదే సమయంలో ముగిసే FD ల మీద 8.85 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తామని ప్రకటించారు.
LAW : తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారి FD ల పై వడ్డీ రేట్లు :
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారు రెండు నుండి మూడు సంవత్సరాల మధ్యన కాల పరిమితిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ల పై 8.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.సీనియర్ సిటిజన్ లకు అదే కాల పరిమితి కి FD ల మీద వడ్డీ రేటును 9.1శాతం వరకు అందిస్తోంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…