brahmamudi serial feb 21st episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, రాజ్ శ్వేత కేక్ కట్ చేస్తూ ఉంటారు. రాజ్ శ్వేతకి కేక్ తినిపిస్తూ ఉంటాడు. శ్వేతని కూడా తినిపించమని అడుగుతాడు. కళావతి ఏమి అనుకోదులే పెట్టు అని రాజ్ అంటాడు. శ్వేత కూడా రాజ్ కి తినిపిస్తుంది. ఇంతలో వెంటనే కావ్య బావ కూడా కావ్యకి కేక్ కట్ చేసి తినిపిస్తాడు. కావ్య కూడా తినిపిస్తుంది.
కావ్య తన బావతో బయటికి వెళ్ళడానికి 2 గంటలు పర్మిషన్ అడుగుతుంది. ఆఫీసులో చాలా పని ఉంది డిజైన్స్ ఎవరు వేస్తారు అని రాజ్ అడిగాడు. శృతి చూసుకుంటుంది నేను మాత్రం బయటికి వెళ్ళాలి లేకపోతే హాఫ్ డే లీవ్ పెడతా అని చెబుతుంది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వను అని రాజ్ అంటాడు. నేను మా బావతో బయటికి వెళ్తే జెలసీగా ఫీల్ అవుతున్నావా అని కావ్య అడుగుతుంది. లేదు లేదు ఇందాక ఎదో రెండు గంటలు పర్మిషన్ అడిగావు కదా తీసుకో అని అంటాడు, రెండు గంటలు కాదు 4 గంటలు కావాలి అని కావ్య అంటుంది. మేము షికారికి వెళ్ళాలి అని కావ్య తన బావతో కలిసి వెళ్తుంది.
అమెరికా అల్లుడు కృష్ణ మూర్తికి ఫోన్ చేసి అంత అనుకున్నట్టుగానే జరుగుతుంది అని చెబుతాడు. కృష్ణ మూర్తి కనకం దగ్గరికి వచ్చి చెబుతాడు. నా కూతురి కాపురం చక్కదిద్దే వరకు నేను మనిషినే కాదు ఇంకేం అయిన అవుతాను అని చెబుతాడు.
రాజ్ శ్వేత దగ్గరికి వచ్చి వాళ్ళు డ్రైవర్ లేకుండా వెళ్లారు అని చెబుతాడు. వెళ్తే ఏమైంది అని శ్వేత అడుగుతుంది.. వాళ్ళ బావతో షికారికి వెళ్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు. దుగ్గిరాల వంశానికి ఒక చరిత్ర ఉంది అని రాజ్ అంటాడు. ఏ కారణం లేకుండా భార్యని వదిలేస్తే మీ వంశానికి గౌరవం దక్కుతుందా అని శ్వేత ప్రశ్నిస్తుంది. నువ్వు ఏంటి ఆ కళావతి లాగా మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటాడు. నేను నీ మన సాక్షిగా మాట్లాడుతున్న అని శ్వేత బదులిస్తుంది. నీకు కావ్యపై ప్రేమ ఉంది కానీ ఆది ఒప్పుకోడానికి నీకు అహం అడ్డొస్తుంది అని రాజ్ అంటాడు.
నాకు తన మీద ప్రేమ లేదు నీకు నిరూపిస్త అని రాజ్ అంటాడు. ఏం చేస్తావ్ అని అడిగితే, ఇప్పుడే ఇంటికి వెళ్లి అందరి ముంది ఆ కళావతి షికారికి వెళ్ళింది అని చెప్తా. తన మీద నింద వేస్తేనేగా నామీద కోపం తో వెళ్ళిపోతుంది అని రాజ్ అనుకోని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి అమ్మమ్మ కి కావ్య పై కంప్లైంట్ చేస్తాడు. ఆమె వాళ్ళ బావతో వెళ్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారు. మన ఇంటి పరువు ఏమైపోవాలి అని అని రాజ్ అంటాడు. అవును రా నువ్వు చెప్పేది కూడా నిజమే! అందుకే కావ్య వాళ్ళ బావని నేరుగా మన ఇంటికే తీసుకొచ్చింది. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు అని చెప్పింది. ఇదేంటి నా ప్లాన్ రివర్స్ అయింది అని రాజ్ అనుకుంటాడు.
Also Read : brahmamudi serial feb 20th episode : కావ్య బావ హ్యాండ్సమ్, జెలసీగా ఫీల్ అవుతున్న రాజ్