brahmamudi serial feb 20th episode : కావ్య బావ హ్యాండ్సమ్, జెలసీగా ఫీల్ అవుతున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, అప్పు అనామికకి వార్నింగ్ ఇస్తుంది. రోడ్ మీదకి వచ్చి ఇలా సవాలు చేస్తే నీ మొగున్ని నా సొంతం చేసుకోవడం పెద్ద పని ఏమి కాదు అని అప్పు అనామికకి వార్నింగ్ ఇస్తుంది.

brahmamudi serial feb 20th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, అప్పు అనామికకి వార్నింగ్ ఇస్తుంది. రోడ్ మీదకి వచ్చి ఇలా సవాలు చేస్తే నీ మొగున్ని నా సొంతం చేసుకోవడం పెద్ద పని ఏమి కాదు అని అప్పు అనామికకి వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ ని మంచిగా చూసుకోమని చెబుతుంది.

రాజ్ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.. శ్వేతకి అనుమానం వస్తుంది. రాజ్ కి కావ్య ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు ఇంత ఆతృతగా ఎదురుచూస్తున్నాడు అని అనుకుంటుంది. రాజ్ ని కూడా అదే ప్రశ్న వేస్తుంది. అదేం లేదు కానీ ఆ బావ ఎలా ఉంటాడో తెలుసుకుందాం అని కొంచం ఆసక్తి అంతే అని రాజ్ బదులిస్తాడు.

ఇంతలో కార్ వస్తుంది. రాజ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బావ ఎలా ఉంటాడో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తాడు. మొదట కార్ లో నుండి కావ్య దిగుతుంది. ఆ తర్వాత, సూటు బూటు వేసుకొని కావ్య బావ దిగుతాడు. వీడు ఎలాగో ఉంటాడు అనుకుంటే ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఏంటి అని రాజ్ అనుకుంటాడు.

brahmamudi-serial-feb-19th-episode-kavyas-brother-in-law-is-handsome-raj-is-feeling-jealous

brahmamudi serial feb 20th episode 

కావ్య వాళ్ళ బావని ఆఫీసులోకి తీసుకొని వస్తుంది. ఆఫీస్ స్టాఫ్ అందరూ అతనికి వెల్కమ్ పలకడానికి అందరు నిలుచొని ఉంటారు. కావ్య వాళ్ళ బావని రాజ్ కి పరిచయం చేస్తుంది. రాజ్ కూడా జలసీ తో శ్వేత నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. నా క్యాబిన్ కి వెళ్లి బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం బావ అని చెప్పి కావ్య తన క్యాబిన్ కి తీసుకెళ్తుంది.

కావ్య మరియు ఆమె బావ వీళ్ళు ఆడుతున్న నాటకం గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్ వచ్చి దొంగచాటుగా వినాలని అనుకుంటాడు. కానీ రాజ్ కి వినపడదు. ఇంతలో శ్వేత వచ్చి ఏమి చేస్తున్నారు సార్ అని అడుగుతుంది. నేను లోపలికి వెళ్లి, ఏం మాట్లాడుకుంటున్నారో విని మీకు వచ్చి చెప్పనా అని శృతి అంటుంది. నేనేం వినట్లేదు అని రాజ్ అంటాడు వెళ్లి డిజైన్స్ పని చూడు అని చెబుతాడు. శృతి వెళ్ళిపోగానే మళ్ళీ మళ్ళీ రాజ్ కావ్య వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని చూస్తాడు. రాజ్ డోర్ దగ్గర నిలబడి వినాలనుకున్నది కావ్య గమిస్తుంది. వెంటనే డోర్ తీయగానే రాజ్ కావ్య మీద పడతాడు.

డోర్ తగిలింది ఇంతలో నువ్వు డోర్ తీసావ్ నేను నీ మీద పడ్డా అంతే అని రాజ్ అంటాడు. ఈసారి జాగ్రత్తగా వెళ్ళండి అని కావ్య అంటుంది. రాజ్ క్యాబిన్ లోకి వెళ్తాడు.. ఏంచేస్తున్నావ్ రాజ్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్? కావ్య నీకు వద్దు అనుకున్నప్పుడు తను ఎవరితో మాట్లాడితే నీకేంటి అని శ్వేత ప్రశ్నిస్తుంది. అవును కదా ఆ కళావతి ఎటు పోతే నాకేంటి అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో ప్యూన్ వచ్చి.. సార్ కేక్ రెడీ అని చెబుతాడు. ఓకే ఇదే మంచి టైం అని ఆఫీస్ స్టాఫ్ అందరిని పిలువు అని రాజ్ ప్యూన్ కి చెబుతాడు. అందరూ వస్తారు.. నా కోసమేనా ఈ కేక్ అని కావ్య బావ అడుగుతాడు. కాదు తమ్మి శ్వేతకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చిన రోజు అని రాజ్ చెబుతాడు. శ్వేతకి వాళ్ళ భర్త నుండి విడాకులు వచ్చాయి అందుకే ఈ కేక్ కటింగ్ అని రాజ్ చెబుతాడు.

Also Read : brahmamudi serial feb 19th episode : పెత్తనం కోసం అనామిక ప్రయత్నం విఫలం, కావ్య కోసం ఎదురుచూస్తున్న రాజ్

Comments are closed.