Hyundai Creta vs Kia Seltos, Excellent Comparison
Hyundai Creta vs Kia Seltos :
హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ కొనుగోలు చేసే సమయంలో చాల మంది కస్టమర్స్ ఈ రెండు కార్స్ మధ్య కన్ఫ్యూషన్ లో ఉంటారు, దీనికి కారణం ఈ కార్స్ యొక్క సైజు మరియు ఇంకా కొన్ని ఫీచర్స్ చాలా వరకు సేమ్ ఉండడమే దీనికి కారణం. అలాగే ఈ రెండు SUVలు ఒకే ప్లాట్‌ఫారమ్ మరియు ఇంజిన్ తో వస్తూ, మూడు పవర్‌ట్రెయిన్ ఒప్షన్స్ తో వస్తున్నాయి: రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్.
Hyundai Creta vs Kia Seltos Exterior:
ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా, రెండు మోడల్స్ షార్ప్ మరియు మోడరన్ లుక్స్ తో వస్తున్నాయి. క్రెటా యొక్క LED హెడ్ లాంప్స్ మంచి విజిబిలిటీని అందిస్తాయి, అయితే సెల్టోస్ యొక్క హెడ్ లాంప్స్ కొంచం షార్ప్ లుక్ తో వస్తాయి, కానీ క్రెటా కన్నా కొంచం తక్కువ లైటింగ్ వస్తాయి. సెల్టోస్‌లో ఫాగ్ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి, ఇవి క్రెటాలో లేవు.
Hyundai Creta vs Kia Seltos Tires:
టైర్ల విషయానికి వస్తే, సెల్టోస్ టాప్ వేరియంట్లలో 18- ఇంచ్ టైర్స్ వస్తున్నాయి, కానీ క్రెటా టాప్ వేరియంట్లలో కేవలం 17-ఇంచ్ టైర్స్ ఏ వస్తున్నాయి. ఈ డిఫరెన్స్ డ్రైవింగ్ అప్పుడు రోడ్ మీద గ్రిప్ మరియు హ్యాండ్లింగ్ లో తెలుస్తుంది. ఈ డిఫరెన్స్ సేఫ్టీ మరియు పెర్ఫార్మన్స్ మీద కూడా చూపిస్తుంది.
Unveiling the Undisputed and Ultimate in automotive excellence – the new Hyundai CRETA on January 16th. Elevate your journey with undisputed style and innovation!#Hyundai #HyundaiIndia #UndisputedCRETA #UltimateCRETA #NewHyundaiCRETA #CRETASUV #ILoveHyundai pic.twitter.com/5yx4QdnHVB
— Hyundai India (@HyundaiIndia) January 10, 2024
Hyundai Creta vs Kia Seltos Interior :
ఇంటీరియర్ విషయానికి వస్తేయ్, క్రెటా దాని అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్‌తో ఆకట్టుకుంటుంది, ఇందులో సాఫ్ట్ ప్లాస్టిక్ మరియు మెరుగైన మెటీరియల్స్ యూజ్ చేసారు. సెల్టోస్, దాని ప్రీమియం క్యాబిన్‌కు ప్రసిద్ధి చెందింది, డ్యాష్‌బోర్డ్‌పై లెథర్ ఫినిషింగ్ మరియు అనేక రకాల కలర్ ఆప్షన్స్ ఇస్తుంది, ఇదీ ఇంకా ప్రీమియం ఫీల్ ని ఇస్తుంది.
As the dust settles on the unveil, here are some photos of the Seltos facelift from the event! (1/5)
Will the Seltos facelift become the next segment leader? pic.twitter.com/2pnULJG4IO
— MotorOctane (@MotorOctane) July 4, 2023
Hyundai Creta vs Kia Seltos Features :
ఫీచర్ల విషయానికొస్తే, రెండు మోడళ్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు బాగా అమర్చబడి ఉన్నాయి. సెల్టోస్, అయితే, దాని హెడ్స్-అప్ డిస్ప్లేతో ప్రత్యేకంగా నిలుస్తుంది, ఈ ఫీచర్ క్రెటాలో అందుబాటులో లేదు.
Hyundai Creta vs Kia Seltos Practicality :
ప్రాక్టికాలిటీ పరంగా, రెండు SUVలు 433 లీటర్ల సమానమైన బూట్ స్పేస్‌ను అందిస్తాయి, లాంగ్ జర్నీస్ లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం వెనక సీట్స్ 60-40 స్ప్లిట్ ఆప్షన్ తో వస్తున్నాయి.
Hyundai Creta vs Kia Seltos Performance :
హైవే ఇంకా సిటీ డ్రైవింగ్ మరియు ఫ్యామిలీ పర్పస్
కోసం ట్యూన్ చేయబడిన మరియు సాఫ్ట్ సస్పెన్షన్ తో క్రెటా కంఫర్ట్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టింది. మరోవైపు, సెల్టోస్ మెరుగైన హ్యాండ్లింగ్‌తో కొంచెం స్పోర్టియర్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది, అయినప్పటికీ
రఫ్ రోడ్స్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు రైడ్ క్వాలిటీ కొంచం స్టిఫ్ గ అనిపించవచ్చు.
Hyundai Creta vs Kia Seltos Safety :
సేఫ్టీ పరంగా, రెండు మోడల్స్ తమ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్లను స్కోర్ చేశాయి. అయినప్పటికీ, ఈ కార్స్ లో ADAS లెవెల్ 2 మరియు వెనుక ప్యాసెంజర్స్ కి త్రి-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ జోడించారు, ఇది మెరుగైన సేఫ్టీ స్టాండర్డ్స్ వైపు కంపెనీస్ పెట్టిన దృష్టిని చూపిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి, ఇవి స్టైల్, ఫీచర్లు మరియు పనితీరు లో బ్యాలన్స్ గ ఉంటాయి. రెండింటి మధ్య సెలక్షన్ అనేది మీ పర్సనల్ ఛాయస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్రెటా కంఫర్ట్ మరియు ప్రీమియం అప్పీల్ వైపు మొగ్గు చూపుతుంది, సెల్టోస్ స్పోర్టియర్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Hyundai Creta vs Kia Seltos Specifications:
Specification | Hyundai Creta | Kia Seltos |
---|---|---|
Engine Options | 1.5L Petrol, 1.5L Diesel, 1.5L Turbo Petrol | 1.5L Petrol, 1.5L Diesel, 1.5L Turbo Petrol |
Transmission Options | Manual, Automatic | Manual, Automatic |
Power Output | 115-138 bhp | 113-138 bhp |
Boot Space | 433 liters | 433 liters |
Ground Clearance | 190 mm | 190 mm |
Tyre Size | 16-inch (Base), 17-inch (Top), 18-inch (Top) | 16-inch (Base), 17-inch (Top), 18-inch (Top) |
Safety Features | ADAS Level 2, 3-Point Seatbelts, Blind Spot Monitoring, Front Collision Warning and Braking, Cross Traffic Alert | ADAS Level 2, 3-Point Seatbelts, Blind Spot Monitoring, Front Collision Warning and Braking, Cross Traffic Alert |
Interior Features | Ventilated Front Seats, Panoramic Sunroof, Electronic Parking Brake | Ventilated Front Seats, Panoramic Sunroof, Electronic Parking Brake |
Infotainment | Touchscreen Display, Android Auto, Apple CarPlay, Wireless Charging | Touchscreen Display, Android Auto, Apple CarPlay, Wireless Charging |
Build Quality | Soft Touch Plastics, Leatherette Finish (Dashboard) | Soft Touch Plastics, Leatherette Finish (Dashboard) |
Drive Experience | Comfort-Oriented, Soft Suspension | Sportier, Stiffer Suspension |
Visibility | Good, Adequate Mirror Size | Good, Small Mirror Size |
Mileage | Decent, Varied by Engine Choice | Decent, Varied by Engine Choice |
Safety Ratings | 3 Stars (Global NCAP, Pre-Facelift) | 3 Stars (Global NCAP, Pre-Facelift) |
Key Features | 360-Degree Camera, Heads-Up Display (Top Variant) | 360-Degree Camera, Heads-Up Display (Top Variant) |
Price Range | INR 10-18 lakhs | INR 10-18 lakhs |
Hyundai Creta vs Kia Seltos, Excellent Comparison