Mitsubishi Pajero 2024, The Outstanding SUV: పాజెరో తో తిరిగి ఇండియన్ మార్కెట్ లోకి రాబోతున్న మిత్సుబిషి.

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లోకి SUV లు ఇంకా పూర్తిగా రాకముందు, ఒకప్పుడు SUV అంతే ఇలా ఉండేదా అని చాల మందిని దాని డిజైన్, పెర్ఫార్మన్స్, లుక్స్ తో ఆకట్టుకున్న పవర్-ఫుల్ SUV మిత్సుబిషి పాజెరో(Pajero), ఇప్పుడు దాని కొత్త మోడల్ తో చాల కాలం తరువాత తిరిగి ఇండియన్ మార్కెట్ లోకి రాబోతుంది.

Mitsubishi Pajero 2024
మిత్సుబిషి పజెరో కొత్త స్పోర్ట్ మోడల్ SUV హై బిల్డ్ క్వాలిటీ మరియు చాలా లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది ఆఫ్-రోడ్ పెర్ఫార్మన్స్ మరియు కంఫర్ట్ రైడింగ్ కి చాల బాగుంటుంది అని కంపెనీ తెలుపుతుంది. ఇందులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు, లేటెస్ట్ ఫీచర్స్ మరియు పవర్-ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో, రెగ్యులర్ డ్రైవింగ్ మరియు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్లకి చక్కని ఛాయస్ అని కంపెనీ తెలుపుతుంది. దీని బోల్డ్ డిజైన్, లేటేస్ట్ 4WD సిస్టమ్ మరియు విశాలమైన ఇంటీరియర్ తో ఇండియన్ SUV మార్కెట్ లో ఇది మిగతా SUV లకి గట్టి పోటీ ఇవ్వబోతుంది.

Mitsubishi Pajero 2024 Exterior:
పజెరో స్పోర్ట్ ఒక ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది, అలాగే LED హెడ్‌లైట్లు మరియు సొగసైన డే టైం రన్నింగ్ లాంప్స్ (DRLs)తో బోల్డ్ మరియు మస్కులర్ డిజైన్‌తో వస్తుంది.

ఫ్రంట్ బంపర్ స్టైలిష్‌గా డిజైన్ చేయబడింది, ఇంటిగ్రేటెడ్ ఫాగ్ లైట్స్ మరియు రగ్గడ్ లుక్ కోసం స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

సైడ్ ప్రొఫైల్‌లో పదునైన క్యారెక్టర్ లైన్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో కూడిన బాడీ-కలర్ ORVMలు మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ (18-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్‌లు) ఉంటాయి.

వాహనం వెనుక భాగం LED టెయిల్‌లైట్‌లు మరియు స్పాయిలర్‌తో హైలైట్ చేయబడింది, మరియు ఎగ్జాస్ట్ క్రోమ్ ఫినిషింగ్ తో వస్తుంది.

Mitsubishi Pajero 2024 Interior:
పజెరో స్పోర్ట్ లోపల చాలా విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది, ఇందులో ఏడుగురు ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది.

క్యాబిన్ ప్రీమియం మెటీరియల్స్ మరియు ఫినిషింగ్‌లతో వస్తుంది, ఇందులో లెదర్ అప్హోల్స్టరీ మరియు సాఫ్ట్-టచ్ సర్ఫేస్‌లు ఉన్నాయి.

డ్యాష్‌బోర్డ్ ఆధునిక లేఅవుట్ మరియు సులభంగా చదవగలిగే గేజ్‌లతో చక్కగా రూపొందించబడింది.

ఈ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది.

Mitsubishi Pajero 2024 Engine and Performance:
పజెరో స్పోర్ట్ 2.4-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో 181 హార్స్‌పవర్ మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది స్మూత్ మరియు మంచి పవర్ అందిస్తుంది.

ఈ SUV మిత్సుబిషి యొక్క సూపర్ సెలెక్ట్ 4WD-II సిస్టమ్‌తో అమర్చబడి ఉంది, ఇది వివిధ రహదారి పరిస్థితుల కోసం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది.

పజెరో స్పోర్ట్‌లో అల్ సైడ్స్ ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS వంటి అనేక అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఇలా ఇంకా ఎన్నో.


Mitsubishi Pajero 2024 Off-Road Capability:
పజెరో స్పోర్ట్ దాని అద్భుతమైన ఆఫ్-రోడ్ పెర్ఫార్మన్స్ కి ప్రసిద్ధి చెందింది, దాని బలమైన ఛాసిస్, లేటేస్ట్ 4WD సిస్టమ్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ వాళ్ళ ఎలాంటి రోడ్స్ లో అయిన ఈజీ గ వెళ్ళిపోతుంది.

ఈ SUV ఇసుక(Sand), మట్టి(Mud) మరియు రాక్(Rock) మోడ్స్ తో సహా ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్స్ తో కూడా వస్తుంది, ఇవి వివిధ రకాల రోడ్ కండిషన్స్ కోసం వాహనం యొక్క పెర్ఫార్మన్స్ ని ఆప్టిమైజ్ చేస్తాయి.

పజెరో స్పోర్ట్‌లో హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇది వాహనం డౌన్ లో ఉన్నపుడు ఒకతె స్పీడ్ తో దిగే లాగా వెహికల్ కి మంచి కంట్రోల్ ఇస్తుంది.

మిత్సుబిషి పజెరో స్పోర్ట్ అనేది కఠినమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యం, సౌకర్యవంతమైన ఆన్-రోడ్ పెర్ఫార్మన్స్ మరియు అనేక లేటేస్ట్ ఫీచర్స్ అందించే ఫుల్ ప్యాకెడ్ SUV.

విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్లకి ఇది ఒక మంచి పవర్-ఫుల్ SUV.

దాని స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ మరియు ఆకట్టుకునే పనితీరుతో, పజెరో స్పోర్ట్ SUV సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇస్తుంది.

Mitsubishi Pajero 2024 Specifications:

Category Specification
Engine 2.4-liter turbocharged diesel
Power 181 horsepower
Torque 430 Nm
Transmission 8-speed automatic
Seating Capacity 7
Wheels 18-inch dual-tone alloy
4WD System Super Select 4WD-II
Off-road Modes Sand, Mud, Rock
Safety Features Multiple airbags, ABS with EBD, traction control
Hill start assist, hill descent control
Infotainment Touchscreen system with smartphone connectivity
Interior Leather upholstery, automatic climate control
Exterior LED headlights, daytime running lights

 

 

 

 

Comments are closed.