Telugu Mirror : వన్ ప్లస్ నార్డ్ CE 4 రిలీజ్ డేట్ ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు ఫోన్ డిజైన్ ను కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ ఏప్రిల్ 1న భారత మార్కెట్లో విడుదల కానుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ గతేడాది జూన్ లో విడుదలైంది. దీనికి కొనసాగింపుగా వన్ ప్లస్ నార్డ్ సీఈ4 5జీ స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెలలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇంతకుముందు ఫోన్లో స్నాప్ డ్రాగన్ 782జీ ఎస్ఓసీ చిప్ సెట్ (Chipset) ను ఉపయోగించింది. కొత్త ఫోన్లోనూ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీనీ (SOC) ఉపయోగించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Also Read : POCO M6 5G : ఇండియా లోనే అత్యంత చౌకైన 5G ఫోన్ POCO M6 5G Airtel ప్రారంభించిన POCO.
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ను ఏప్రిల్ 1న సాయంత్రం 6:30 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ ఫోన్ కు సంబంధించిన డిజైన్ ను కూడా ఎక్స్ (Twitter) వేదికగా రివీల్ చేసింది. అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్ (Amazon) వెబ్ సైట్లో కూడా ఈ ఫోన్ కోసం ప్రత్యేక ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది.
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్లో 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి మరియు 16MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. 1080 x 2412 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో రాబోతోంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 2.63 GHz ఆక్టా-కోర్ CPUతో అందుబాటులోకి రానుంది. దీంతో ఈ వన్‌ప్లస్ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్ Adreno 730 GPU సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది 5000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది.
Also Read : Telangana Overseas Scholar Ship 2024 విద్యార్థులకు గుడ్ న్యూస్, ప్రభుత్వం నుండి రూ.20 లక్షలు సాయం
ఈ వన్‌ప్లస్ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అందులో మొదటిది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే..రెండవది 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇటీవలే ఈ మొబైల్‌కి సంబంధించిన ధరలు కూడా లీక్ అయ్యియి. ఇందులో మొదటి వేరియంట్ 8GB + 128GB మొబైల్ ధర రూ.23,999తో అందుబాటులోకి రానుంది. రెండవ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్‌తో రూ.25,999లకు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.