Telangana Overseas Scholar Ship 2024 విద్యార్థులకు గుడ్ న్యూస్, ప్రభుత్వం నుండి రూ.20 లక్షలు సాయం

విదేశాల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఇంతకీ ఆ పథకం ఏంటి? ఈ పథకానికి ఎవరు అర్హులు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana Overseas Scholar Ship 2024 ఆధునికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చదువుకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఈరోజుల్లో ప్రతి ఇంట్లోకి చదువుకున్న వాళ్ళు ఉంటూనే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా చదువుకునేవారికి స్కాలర్షిప్స్ రూపంలో, రీఎంబేస్మెంట్ రూపంలోనూ లేక కొన్ని పథకాల రూపంలో విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.

విదేశాల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఇంతకీ ఆ పథకం ఏంటి? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు? దీనికి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు మేము అందిస్తున్నాము. అవేంటో ఒకసారి చూద్దాం.

విదేశీ చదువుల కోసం తెలంగాణ ప్రభత్వ పథకం..

మన దేశంలో పిల్లలు, విదేశాల్లో చదువుకొని మంచి స్థాయిలో నిలబడినవారు చాలా మంది ఉన్నారు. అయితే, విదేశాల్లో చదువును అభ్యసించాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్  విద్యానిధి పథకాన్ని 2015 లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదివే పిల్లల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వస్తే ఈ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతుంది.

ఈ పథకానికి అర్హులు ఎవరు?

అంబేద్కర్ ఓవర్సీస్  విద్యానిధి పథకానికి షెడ్యూల్డ్ కులాలు అయిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హులు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకునే ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20 లక్షలు సహాయం అందిస్తుంది. మొదట్లో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేది. కానీ, అవి సరిపోకపోవడంతో కుంటుంబ ఆదాయం రూ.5 లక్షలు ఉంటే విదేశీ విద్య అభ్యసించాలనుకునే వారికి రూ.20 లక్షలు పెంచి ఆర్థిక సాయం అందిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలంటే ముందుగా టోఫెల్, జీఆర్ఈ, పీటీఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్ లో ఏదైనా పరీక్ష రాసి అందులో ప్రవేశం పొందిన వారికోసం ఈ పథకానికి అర్హులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అంబేద్కర్ ఓవర్సీస్  విద్యానిధి పథకం కింద ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, ఈ క్రింది దశలను అనుసరించింది.

  • అధికారిక వెబ్‌సైట్‌ https://telanganaepass.cgg.gov.in/ను సందర్శించండి
  • అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, ఎస్టీ,ఎస్సీ డెవలప్మెంట్ విభాగం కోసం చూడండి.
  • రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది.
  • డిక్లరేషన్ లింక్‌ను చెక్‌మార్క్ చేయండి.
  • ఇప్పుడు డిక్లరేషన్ కోసం ‘క్లిక్ హియర్’ అనే ఆప్షన్ ని ఎంచుకోండి.
  • రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది.
  • అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేయండి.
  • సంబంధిత డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయండి.
  • క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • చివరికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

విద్యార్థులు ఈ నెల అంటే మర్చి 31వతేదీ లోగా దరఖాస్తు చేసుకోండి. ఉన్నత చదువులు చదవాలి అనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Telangana Overseas Scholar Ship 2024

 

 

 

 

 

 

Comments are closed.