Jio IPL Plans : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 మార్చి 22న ప్రారంభమవుతుంది. రెండు నెలల పాటు జరిగే IPL 2024 మ్యాచ్‌లను చూడటానికి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. IPL 2024 కోసం టెలికాం సంస్థలు కూడా వివిధ రకాల డేటా ప్యాక్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెలికామ్ కంపెనీ అయినా Reliance Jio రెండు సరికొత్త ప్లాన్‌లను అందిస్తోంది.
Also Read : Money in to Farmers Account in Telangana: రైతులకు శుభవార్త, ఎకరానికి రూ.10,000 మీ సొంతం
Jio సినిమా ఇప్పుడు IPL 2024 సీజన్ 17 మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించడానికి వీలు కల్పిస్తుంది.ఇది పూర్తిగా ఉచితం దీనికోసం ఎటువంటి ప్లాన్ ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. జియో సిమ్ కార్డ్ హోల్డర్లు అందరు జియో సినిమా (Jio Cinema) ఉచిత యాక్సెస్ పొందుతారు. రిలయన్స్ జియో ప్రస్తుతం ఈ డేటా కోసం రెండు ప్లాన్‌లను మాత్రమే అందిస్తోంది. మీరు IPL మ్యాచ్‌లను చూడటానికి ఈ plans ఉత్తమమైనవి కావొచ్చు. ఈ ప్లాన్ లలో మొదటిది రూ.667 మరియు రెండవది రూ.444 గా ఉన్నాయి.
రిలయన్స్ జియో 667 ప్లాన్..
రూ. 667 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కేవలం డేటా మాత్రమే వస్తుంది. దీంట్లో వాయిస్ కాలింగ్, SMS వంటి ప్రయోజనాలేమీ ఉండవు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే కచ్చితంగా ఏదో ఒక బేస్ ప్లాన్ ఉండాల్సిందే. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చు.
Also Read : Small Business : తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..వేసవిలో డిమాండ్ ఉన్న బిజినెస్.
రిలయన్స్ జియో 444 ప్లాన్..
జియో 444 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 100 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 60 రోజుల వ్యాలిడిటీని అందించారు. ఈ ప్లాన్‌కు కూడా ఏదో ఒక బేస్ ప్లాన్ ఉండాల్సిందే. ఇదిలా ఉంటే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ వీక్షించవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (Subscription) లేని వారు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించారు. ఇక జియో యూజర్లు మాత్రమే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.