Small Business : తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..వేసవిలో డిమాండ్ ఉన్న బిజినెస్.

వేసవిలో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్‌తో రోజుకు రూ.5 వేల వరకు ఆదాయం పొందండి.

Telugu Mirror : ఈ వేసవి కాలం లో ఎక్కువగా ఎండకి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆలా ప్రయాణం చేస్తున్నప్పుడు చల్లటి చెరుకు రసం (sugarcane juice) తాగాలని అందరికి ఉంటుంది. చెరకు రసం వేసవిలో దాహాన్ని తీర్చడమే కాకుండా, మానవ శరీరానికి మేలు చేసే అనేక వైద్య లక్షణాలను కలిగి ఉంది. వేసవి కాలంలో వివిధ అవసరాల కోసం రోడ్లపై ప్రయాణించే వారు ఎండ వేడిమి కారణంగా త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో చెరుకు రసం తాగడం వల్ల అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.

Also Read : Lava O2 : కేవలం రూ.10,000 లోపే లావా నయా స్మార్ట్‌ఫోన్‌..బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో..!

ఈ నేపథ్యంలో వేసవి కాలం (Summer) వచ్చిందంటే చాలు రహదారులపైనా అనేక చెరుకు రసం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది ఒక మంచి వ్యాపారం అని కూడా చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని ఈ వ్యాపారం లో పొందవచ్చు. అయితే ఇప్పుడు అసలు ఈ చెరుకు రసం వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి దానివల్ల ఎంత లాభం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Get more returns with less investment with sugarcane juice business

ఈ చెరుకు రసం వ్యాపారం కోసం ముందుగా ఒక చల్లని ప్రదేశం చూసుకోవాలి. తర్వాత చెరుకు రసం చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టుకోవాలి. ఇక చెరుకు ఆంధ్రప్రదేశ్‌లోని వియం బంజారా ప్రాంతం నుండి చెరకును (Sugar Crane) దిగుమతి చేసుకోవచ్చు. ప్రతిరోజూ చెరుకు మనం ఉపయోగిస్తాం కాబట్టి కొంచెం తక్కువ ధరకే మనకి చెరుకు లభిస్తుంది. ప్రస్తుతం టన్ను చెరకు ధర రూ. 7000. గా ఉంది. రవాణా ఖర్చులు అదనంగా రూ. 1000 వరకు అయితాయి.

Also Read : Allu Arjun: ఆంధ్రాలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..త్వరలోనే మల్టీప్లెక్స్‌ ప్రారంభం.

అల తెచ్చిన చెరకును శుభ్రం చేసిన తర్వాత, తాజా చెరకు రసం తయారు చేయవచ్చు. చెరకు రసం లో నిమ్మ మరియు అల్లం వంటి ఆరోగ్యకరమైన పదార్దాలు కూడా వేయవచ్చు. కస్టమర్ యొక్క ప్రాధాన్యతల ఆధారంగా ఐస్ (Ice) మరియు సబ్జా గింజలు కూడా ఈ చెరుకు రసం లో ఉపయోగించవచ్చు. ఇక 20 రూపాయలకే అందరికీ ఒక గ్లాసు చెరుకు రసం అందించవచ్చు. ప్రతిరోజు 3 నుంచి 5 వేల రూపాయల వరకు  ఆదాయం వస్తుంది, ఖర్చులు అన్ని పోను రోజుకు 1000 నుండి 1500 రూపాయలు మిగులుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ చిన్న బిజినెస్ ను స్టార్ట్ చేసేయండి.

Comments are closed.