Pan Card Update: ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ లేకుండా ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేయదు. పాన్ కార్డు కూడా తప్పనిసరి అయింది. మీకు ఆధార్-పాన్ కార్డ్ కూడా ఉంటే, మీకు ఒక అలర్ట్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్‌లను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది . మీరు ఇంకా మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, గడువులోపు లింక్ చేసుకోండి. పాన్ కార్డులను కలిగి ఉన్న హోల్డర్లు గడువు తేదీలోగా తమ ఆధార్ కార్డులతో పాన్ లింక్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మే నెల 31లోగా పాన్ ఆధార్ తో లింక్ చేస్తే టీడీఎస్ తగ్గింపుపై ఎటువంటి చర్యలు తీసుకోరని ఆ తర్వాతే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.
బయోమెట్రిక్ తో ఆధార్ పాన్ కార్డు తో లింక్ చేయకపోతే సాధారణ రేటు కన్నా రెట్టింపు టీడీఎస్ తగ్గిస్తుందని సీబీడీటీ తెలిపింది. దీని గురించి పన్ను చెల్లింపుదారుల నుండి పిర్యాదులు రావడంతో మే 31 వరకు బయోమెట్రిక్ ఆధార్ పాన్ కార్డు లింక్ చేయకపోతే టీడీఎస్ రేటు తగ్గుతుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
మీ పాన్ మరియు ఆధార్ కార్డ్‌లను ఇలా లింక్ చేయండి.
- ముందుగా, https://www.incometax.gov.in/iec/foportal లో ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ‘లింక్ ఆధార్’ ఎంపికను క్లిక్ చేయండి
- మీ స్థితిని తనిఖీ చేయడానికి, ‘CLICK HERE ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, మీ ఆధార్ మరియు పాన్ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయండి.
- మీ పాన్ కార్డ్ ఇప్పటికే ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడి ఉంటే, మీ పాన్ ఆధార్ నంబర్‌కి లింక్ అవుతుంది.
- మీ ఆధార్ మరియు పాన్ కార్డ్‌లు కనెక్ట్ కాకపోతే, https://www.incometaxindiaefiling.gov.in/homeని సందర్శించండి.
- ఇప్పుడు, ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ సమాచారాన్ని నమోదు చేయండి.
- మీ పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్‌కి కనెక్ట్ అయినట్టు నోటీసు అందుతుంది.
SMS ద్వారా ఆధార్-పాన్ కనెక్షన్
మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేకపోతే, మీరు SMS పంపి మీ పాన్ మరియు ఆధార్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు. మీరు కూడా SMS సేవను ఉపయోగించాలనుకుంటే… మీ రిజిస్టర్డ్ సెల్ నంబర్ నుండి 567678 లేదా 561561కి SMS ద్వారా UIDPAN <12-అంకెల ఆధార్> <10-అంకెల PAN>ని పంపండి. దీని తర్వాత, మీరు లింక్ గురించి మెస్సేజ్ ని అందుకుంటారు.