Aadhar Atm 24/7, useful news: ఆధార్ ఎటిఎం తో ఇక ఇంటి వద్దకే డబ్బు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ATM (AePS) సర్వీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

Aadhar Atm: ఆధునిక కాలంలో ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ (UPI Transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్ పేమెంట్స్ (Online Payments) కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, కొన్ని కొన్ని సందర్భాలలో కూడా డబ్బు అవుతుంది. అందుకే చాలా మంది ఇంట్లోనూ, పర్స్ లో కొంత నగదును పెట్టుకుంటారు.

కానీ కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినప్పుడు పరిస్థితి ఏంటి?

ఎటిఎం (ATM) వద్దకు కూడా వెళ్లలేని సమయంలో ఏం చేయాలి? ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే వచ్చి డబ్బు ఇచ్చే ఒక కొత్త సర్వీస్ గురించి తెలుసుకుందాం.

Aadhar Atm ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ATM (AePS)సర్వీస్

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ATM (AePS) సేవను అందిస్తుంది, ఇది మీ ఇంటి వద్ద నుండి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (aadhaar enabled payment system)ని ఉపయోగించి, బయోమెట్రిక్ (Biometric) ఉన్న ఎవరైనా నగదు విత్‌డ్రా (Money With Drawl) చేసుకోవచ్చు. మీరు ఆధార్‌తో లింక్ (Aadhar Link) అయి ఉన్న ఖాతా నుండి కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్ విత్‌డ్రా, బ్యాలెన్స్ ఎంక్వయిరీ (Balance Enquiry) , మినీ స్టేట్‌మెంట్ (Mini Statement) , ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ (Aadhar to Aadhar Fund Transfer) మొదలైన వాటితో పాటు ఇతర బేసిక్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్‌లు సరిపోతాయి. ఈ లావాదేవీలకు ఎలాంటి రుసుములు లేవు. డోర్‌స్టెప్ సేవలను ఉపయోగించినప్పుడు ఖర్చు ఉంటుంది. గరిష్టంగా రూ. 10,000 ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

  • సేవలను ఉపయోగించడానికి బ్యాంక్ ఖాతా అవసరం. ఆ బ్యాంక్ AEPS సర్వీసింగ్ లిస్ట్‌లో ఉండాలి.
  • దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన బ్యాంకు ఈ సేవను అందిస్తోంది. వ్యక్తుల ఆధార్ నంబర్లను వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేసి ఉండాలి.
  • అప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి లావాదేవీలు ప్రాసెస్ చేస్తారు.
  • IPPB డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా పూర్తి చేసిన లావాదేవీ విజయవంతమైందో లేదో తెలుసుకోవడానికి SMS ద్వారా చూడవచ్చు.
  • డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌ (Door Step Banking) ని యాక్సెస్ చేయడానికి, https://ippbonline.com/web/ippb/doorstep-banking2ని సందర్శించండి. సేవా అభ్యర్థన ఫారమ్‌లో వివరాలను తప్పనిసరిగా చేర్చాలి. దీని కోసం, మీ పేరు, చిరునామా మరియు సమీపంలోని పోస్టాఫీసును తప్పక ఎంచుకోవాలి. ఈ సేవల గురించి అదనపు సమాచారం కోసం, https://ippbonline.com/web/ippb/aeps-faqs లో పోస్ట్‌ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Aadhar Atm

Comments are closed.