Telugu Mirror: ప్రతి ఒక్కరు తమ చర్మం అందంగా మరియు కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. మెరిసే చర్మం సొంతం చేసుకోవడానికి వివిధ రకాల పద్ధతులను పాటిస్తారు. కొంతమందికి డబ్బు మరియు సమయం లేని కారణంగా పార్లర్(parlour)కి వెళ్లలేకపోతున్నారు. అయితే పార్లర్ లో స్కిన్ కేర్(skin care)ట్రీట్మెంట్ తీసుకున్నాక దాని ప్రభావం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత చర్మం మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. అయితే మీరు మెరిసే చర్మం పొందాలంటే శాశ్వతంగా పనిచేసే ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటించడం వల్ల మీ చర్మంపై ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
పసుపును తరచుగా వాడటం వల్ల మీ ముఖంపై ఉన్న అనేక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి పసుపును చర్మ సౌందర్యం కోసం చాలామంది వాడుతూనే ఉంటారు. ఇది చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది .
కాబట్టి ఈరోజు మీకు కాంతివంతమైన చర్మం పొందడం కోసం ఆర్గానిక్ పసుపును ఉపయోగించి తయారు చేసే కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
1. ఆర్గానిక్ పసుపు(organic turmeric) లో, రోజ్ వాటర్(rose water), గంధపు పొడి మరియు తేనె కలపాలి. దీన్ని పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని ముఖం పై అప్లై చేసి ఆరిన తర్వాత నార్మల్ వాటర్(normal water)తో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖంపై ఉన్న మొటిమలు తగ్గించడంతోపాటు, ముఖానికి మెరుపుని కూడా తీసుకువస్తుంది.
2. త్రీ టీ స్పూన్స్- మిల్క్ మరియు పావు టీ స్పూన్- పసుపు వేసి కలపండి . దీన్ని ఫేస్ కి మర్దన చేస్తూ అప్లై చేయండి. ఆరిన తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది . దీనిని తరచుగా వాడటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
3. తాజా పెరుగులో(fresh curd),
శనగపిండి, పసుపు కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ మచ్చలను తొలగించడంతోపాటు కాంతివంతంగా కూడా చేస్తుంది.
4. మొఖం మీద నల్ల మచ్చలు మరియు కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటే ఈ ప్యాక్ తయారు చేయండి. బియ్యప్పిండిలో టమోటా రసం ,పచ్చిపాలు, పసుపు కలిపి పేస్టులా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడగాలి. దీన్ని తరుచుగా చేస్తే కొన్ని రోజుల తర్వాత ప్రభావం మీకే తెలుస్తుంది.
5. ఒక స్పూన్- పసుపు, రెండు స్పూన్ల- శెనగపిండి, మూడు స్పూన్ల -రోజు వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ మీ చర్మం లో మెరుపును తీసుకువస్తుంది.
ప్రతి ఒక్కరు ఈ ఇంటి చిట్కాలను పాటించి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి. పార్లర్ లో వచ్చే మెరుపును మీరు ఇంట్లోనే పొందండి.