Telugu Mirror : ప్రపంచ కప్ చరిత్రలో చాలా వరకు ఆస్ట్రేలియా, భారతదేశ ప్రజల హృదయాలను గాయపరిచింది. ఆస్ట్రేలియా 1987 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజి లో ఒక పరుగు తేడాతో భారత్ పై విజయం సాధించింది. 2003 ప్రపంచ కప్ ఫైనల్ మరియు 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్ ను ఓడించింది. 1999లో ప్రపంచ కప్ సూపర్-సిక్స్ ఫైనల్ గేమ్‌లో పాకిస్తాన్ ను ఓడించింది. ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్‌లుగా బహుమతి పొంది, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారతదేశానికి అతిపెద్ద అడ్డంకిగా నిలిచారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా ఆటలు సాగలేదు 2023 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజి లో ఆదివారం జరిగిన ఇండియా -ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించింది.
ALSO READ : బాలయ్య సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది, ఈసారి లిమిటెడ్ బాసు
KL రాహుల్ మరియు విరాట్ కోహ్లీ నుండి అద్భుతమైన బ్యాటింగ్ మరియు భారత్ స్పిన్ బౌలింగ్ యొక్క సమగ్ర ప్రదర్శనతో, భారతదేశం ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో స్వల్ప లక్ష్య ఛేదనలో 41.2 ఓవర్లో విజయం సాధించిన భారత్ కేవలం 0.883 రన్ రేట్ సాధించి ఇప్పటివరకు గెలుపొందిన జట్ల జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. భారత్ చేతిలో ఓడిన ఆసీస్ ఆరో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు వరుసగా 7 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి.
ఇంగ్లాండ్ పై తొలి మ్యాచ్ లో బంపర్ విక్టరీ సాధించిన న్యూజిలాండ్ 2.149 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో
అగ్రస్థానంలో ఉండగా భారీ స్కోర్ చేసి శ్రీలంకను ఓడించిన సౌతాఫ్రికా 2.040 రన్ రేట్ తో రెండో
స్థానంలో ఉంది. నెథర్లాండ్స్ పై ఓ మోస్తరు విజయం సాధించిన పాక్ 1.620 రన్ రేట్ తో మూడో స్థానంలో
ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించిన బంగ్లాదేశ్ 1.438 రన్ రేట్ తో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి అన్ని జట్లు ఒక మ్యాచ్ మాత్రమే ఆడాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ఇంకా తలో 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ALSO READ : ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా
ఈ విజయం భారతదేశం యొక్క వ్యూహాలు (strategies) మరియు ఎంపిక విధానాలకు కూడా ఒక గొప్ప నిదర్శనం ఎందుకంటే తొడ గాయం నుంచి తిరిగి వచ్చిన రాహుల్‌పై సెలెక్టర్లు విశ్వాసాన్ని ఉంచి చాల గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియా ని అతి తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ చేసింది. దాని తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ టీం కు స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ల నుంచి గట్టి దెబ్బె తగిలిందని చెప్పొచ్చు. వరుసగా రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ డక్ అవుట్ అయ్యారు, అయితే విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8ఫోర్లు, 2 సిక్సర్లు) తో చిరస్మరణీయ ఇన్నింగ్స్ సాయంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక
విజయం సాధించింది.