బాలయ్య సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది, ఈసారి లిమిటెడ్ బాసు

అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు.

Telugu Mirror : ఆహా “అన్‌స్టాపబుల్” (Unstoppable) తో నందమూరి బాలకృష్ణ మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. రెండవ సీజన్‌లో నందమూరి బాలకృష్ణ టాక్ షో “అన్‌స్టాపబుల్” పట్ల ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. గాడ్ ఆఫ్ మాస్ ‘నందమూరి బాలకృష్ణ’ హోస్ట్ గా మారి మొదటి రెండు సీజన్ల ని విజయవంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అద్భుతంగా హోస్ట్ చేస్తూ ఉన్నందున, ఆహా యాప్ కి కూడా ఒక మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఈ అన్‌స్టాపబుల్ షో కారణంగా ఉత్తమ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫారం అయిన ఆహాలో సబ్స్క్రిప్షన్ (Subscription) రేట్ కూడా విపరీతంగా పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ కి ఫిదా అయిపోయిన అభిమానులు ఈ షో ద్వారా బాలయ్య లో ఉన్న మరో కోణాన్ని చూసి కూడా ఫిదా అయిపోయారు.

Also Read : ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను మార్చుకోవాలా, అయితే ఇలా ఈజీగా మార్చుకోండి

ఈ షో ద్వారా బాలయ్య కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఘనంగా జరుపుకునే ఈ దసరా పండుగ సందర్బంగా  అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్  మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నట్టు నెట్టింట టాక్ వచ్చింది. అయితే, అన్‌స్టాపబుల్ రెండవ సీజన్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, విశ్వక్ సేన్ , సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, జయసుధ, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, మరియు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇప్పుడు,మేకర్స్ తదుపరి సీజన్ ఉంటుందని వెల్లడించడం ద్వారా ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. మొదటి రెండు సీజన్స్ లో   వచ్చిన సెలెబ్రిటీలతో బాలయ్య ఇంటరాక్షన్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆహా యాజమాన్యం సీజన్  3 కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

అయితే, కొత్త సీజన్ ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మేకర్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటు మూడో సీజన్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ , మెగాస్టార్ చిరంజీవి , కల్వకుంట్ల తారక రామారావు (KTR) వంటి ప్రముఖులు ఈ షోలో కనిపించవచ్చని బయట ప్రచారాలు వినిపిస్తున్నాయి, కానీ దీని గురించి ఇంకా స్పష్టత లేదు. కానీ కొద్దీ రోజుల్లో దీని గురించి మాత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. బాలయ్య ఈ షో చేసేందుకు అక్టోబర్ 5న సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ యొక్క షూటింగ్ భగవంత్ కేసరి రిలీజ్ అయ్యాక మొదలవుతుందని భావిస్తున్నారు.

Also Read :తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని, ప్రతిరోజు తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి

Comments are closed.