పిల్లలకు జలుబు, దగ్గుతో ఇబ్బందా, అయితే జింజర్‌ క్యాండీని చేసి ఇవ్వండిలా

దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం రసం ఇస్తే పిల్లలు తాగరు. దానికి బదులుగా జింజర్ క్యాండీలు చేసివ్వండి ఇష్టంగా తినేస్తారు

Telugu Mirror : మనకి దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి లాంటి సమస్యలు ఉంటె వెంటనే మన చూపు అల్లం (Ginger) వైపు తిరుగుతుంది. అల్లంలో సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే స్వభావం ఉంటుంది. కానీ అల్లం అంత రుచిని కలిగి ఉండదు. ఇక పిల్లలకు అయితే ఇది ఇవ్వడం ఒక సవాలుతో కూడిన విషయం అనే చెప్పుకోవాలి. కానీ మిఠాయితో కూడిన పదార్దాలు మాత్రం అందరూ ఇష్టపడతారు. రుచితో కూడిన అల్లం మిఠాయిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి మరియు దాని వల్ల  కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం.

అల్లం మిఠాయి తయారు చేసుకునే విధానం..

ముందుగా ఒక వెడల్పాటి కలాయిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయండి. ఆ ఉప్పు వేడి అయ్యాక  అందులో అల్లం వేసి ఒక 7 నుండి 8 నిమిషాల పాటు వేడి చేయండి. ఇక అందులో నుండి అల్లం తీసి నీటిలో వేసి ఒక రెండు నిముషాలు ఉంచండి. ఇప్పుడు అల్లం తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా పుదీనా కూడా వేసి మెత్తగా పట్టుకోవాలి. ఒక పాన్ లో బెల్లం ,అల్లం మిశ్రమం వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి. కాస్త ఉడికిన తర్వాత అందులో యాలుకల పొడి, కొద్దిగా పసుపు చివరిలో కొంచం నెయ్యి వేసుకొండి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి. పంచదారను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బాల్స్ ని అందులో వేసి కొంచెం సేపు ఉంచి బయటకు తీయండి. అంతే ఎంతో రుచిని మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే అల్లం మిఠాయి సిద్ధంగా ఉంది.

Also Read : రుద్రాక్ష అంటే ఏమిటి, రుద్రాక్ష ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలుంటాయి

అల్లం మిఠాయి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది 
అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి హాని కలిగించే ఫ్రీ-రాడికల్స్ తో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ (Infections) లాంటివి కూడా రాకుండా మీ శరీరాన్ని కాపాడుతుంది. జింక్, మెగ్నీషియం, విటమిన్-సి , విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

2. కోల్డ్ ఫైటర్
జలుబు వస్తే అది తగ్గించడానికి అల్లం గొప్ప ఔషదంగా పని చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గించి, మీ గొంతు గరగర ను తగ్గిస్తుంది. మీరు విశ్రాంతి భావనను పొందుతారు.

3. దగ్గుని నివారిస్తుంది
అల్లంలో ఉండే ఘాటు, దగ్గు నుండి ఉపశమనం కలగడానికి చాలా  బాగా ఉపయోగపడుతుంది.

Comments are closed.