Telugu Mirror : భారత దేశం అంతటా స్విగ్గీ (Swiggy) చాలా పాపులర్ అయింది. అయితే, ఆన్లైన్ (Online) లో ఫుడ్ ఆర్డర్ పై మరియు డెలివరీ సర్వీస్ లపై స్విగ్గీ “వన్ లైట్ మెంబర్ షిప్” (One Lite Membership) ప్లాన్ ను ప్రారంభించింది. ఈ కొత్త మెంబర్షిప్ ప్లాన్ యొక్క మూడు నెలల రుసుము రూ 99. ఈ ప్లాన్ ద్వారా స్విగ్గీ కస్టమర్లకు ఉచిత డెలివరీలు, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్లు మరియు మరెన్నో ప్రత్యేకతలను అందిస్తుంది.
Also Read : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, వరల్డ్ కప్‌లో టీమిండియా బోణీ
స్విగ్గీ (Swiggy) చెప్పిన దాని ప్రకారం, కస్టమర్లకు రూ. 149 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై 10 ఉచిత డెలివరీలు మరియు రూ. 199 కంటే ఎక్కువ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై 10 ఉచిత డెలివరీలను పొందే అవకాశాన్ని స్విగ్గీ అందిస్తుంది. Swiggy One Lite మెంబర్షిప్ ప్లాన్‌లోని సబ్స్క్రైబర్స్ (Subscribers ) కంపెనీకి చెందిన 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్స్ లో ఆర్డర్లపై 30% వరకు అదనపు తగ్గింపులతో పాటు ఉచిత డెలివరీలను కూడా అందుకుంటారు.
స్విగ్గీ ఎప్పటికప్పుడు అనుకూలమైన కొత్త మార్గాల కోసం వెతుకుతు మరియు దేశం లో అత్యంత ముఖ్యమైన ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ గా మారిందని స్విగ్గీ రెవిన్యూ అండ్ గ్రోత్ వైస్ ప్రెసిడెంట్ పంగనామాముల అనురాగ్ తెలిపారు. స్విగ్గీ ప్రకారం, Swiggy One Lite సబ్‌స్క్రైబర్, ఫుడ్ డెలివరీపై మరియు ఇన్‌స్టామార్ట్ లో ఆర్డర్లు చేసినప్పుడు వారి సభ్యత్వ రుసుముపై కనీసం 6x రిటర్న్‌ను అందుకుంటారు, ఇది మూడు నెలలకు ప్రారంభ ధర రూ. 99 ఉంటుందని స్విగ్గీ పేర్కొంది. విలువైన మెంబర్షిప్ ప్రోగ్రామ్ ను తమ కస్టమర్లను థ్రిల్ చేయడానికి మరియు Swiggy యొక్క సౌలభ్యాన్ని పరిచయం చేయడానికి తీసుకువచ్చాం అని కంపెనీ తెలిపింది.
Also Read : బాలయ్య సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది, ఈసారి లిమిటెడ్ బాసు
Swiggy One Lite Membership
Swiggy One Lite తో పాటు అనేక సభ్యత్వ ఎంపికలను Swiggy అందిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లకు Swiggy One సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా 70,000 కంటే ఎక్కువ రెస్టారెంట్ల నుండి అపరిమిత ఉచిత డెలివరీలను అందిస్తుంది, ప్రముఖ రెస్టారెంట్ల రెగ్యులర్ ఫుడ్ డిస్కౌంట్లలో అదనంగా 30% వరకు తగ్గింపుని అందిస్తుంది. రూ. 99 కంటే ఎక్కువ ఆర్డర్లపై Swiggy Instamart నుండి ఎటువంటి పెరుగుదల లేకుండా ఉచిత డెలివరీ అందిస్తుంది.