Samsung Galaxy M34 5G: వచ్చేసింది…6,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా

Telugu Mirror : కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ అయిన Samsung ఈ రోజు జూలై 7న Samsung Galaxy M34 5G ను భారత దేశంలో రిలీజ్ చేసింది.Samsung Galaxy M34 5G విడుదల అయ్యింది కానీ అమ్మకాలు ఇంకా మొదలుకాలేదు. Galaxy M34 5G ఒక బడ్జెట్ ఫోన్, ఈ హ్యాండ్ సెట్ రెండు స్టోరేజ్ స్పెసిఫికేషన్ లతో అందుబాటులో ఉంది.

ఒకటి 6GB RAM + 128GB ROM స్టోరేజ్ వేరియంట్ మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది. బేస్ మోడల్ అయిన 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.16,999 అలానే హై ఎండ్ మోడల్ 8GB RAM మరియు 128GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగిన హ్యాండ్ సెట్ యొక్క ధర రూ.18,999. అయితే ఈ ధరలు కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి.

Brain-eating Amoeba –“మెదడు తినే అమీబా” వ్యాధి సోకి విద్యార్థి మృతి.. విషాదం లో కుటుంబం

తరువాత ధరలు పెరగవచ్చు. Galaxy M34 5G యొక్క అమ్మకాలు జూలై 15 నుంచి మొదలవుతుంది. Samsung స్టోర్ మరియు అమెజాన్ లో Samsung Galaxy M34 ను కొనవచ్చు.Samsung Galaxy M34 5G మిడ్ నైట్ బ్లూ, ప్రిసం సిల్వర్ మరియు వాటర్ బ్లూ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్ సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగిన 6.6-inch ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ ప్లే మరియు 1,080×2,408 పిక్సెల్స్ రెజల్యూషన్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 1000 నిట్స్ వరకు బ్రైట్ నెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది, దీంతో ఫోన్ యొక్క స్క్రీన్ ఎంతో దృఢంగా ఉంటుంది.

Samsung Galaxy M34 5G మూడు రియర్ కెమెరాలతో వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగిన 50- మెగా పిక్సెల్ “నో షేక్” మెయిన్ కెమెరాతో వచ్చింది. అలానే 120 డిగ్రీల పాటు వైడ్ ఫోటోలను తియ్యడానికి 8- మెగా పిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది. నైటోగ్రఫీ, మాన్ స్టర్ షాట్ 2.0 మరియు ఫన్ మోడ్ వంటి కెమెరాలతో వస్తుంది.

Cricket : భారత క్రికెటర్ల లో అత్యంత రిచ్ క్రికెటర్..

అలానే Samsung Galaxy M34 5G, 5nm Exynos 1280 SoC చిప్ సెట్ తో తయారు చేయబడింది. ఈ హ్యాండ్ సెట్ మాన్ స్టర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుందని Samsung తెలిపింది. ఈ చిప్ సెట్ 8GB RAM మోడల్ లో ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 13 మరియు UI 5 తో వస్తుంది.

అలానే 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్ డేట్ లు మరియు 4 సంవత్సరాల పాటు OS అప్ డేట్ లు వస్తాయని Samsung మాటిచ్చింది.
Samsung Galaxy M34 5G 6000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. USB Type-C ఛార్జింగ్ కేబుల్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డ్యుయల్ 5G సిమ్ లను సపోర్ట్ చేస్తుంది. అలానే WiFi, Bluetooth, GPS కనెక్టవిటీలను కలిగి ఉంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in