Brain-eating Amoeba –“మెదడు తినే అమీబా” వ్యాధి సోకి విద్యార్థి మృతి.. విషాదం లో కుటుంబం

Telugu Mirror: కేరళ లోని అలప్పుజా జిల్లాలోని పూచక్కల్ కు చెందిన పదవ తరగతి విధ్యార్ధి “మెదడు తినే అమీబా” అని పిలిచే ఏకకణజీవి శరీరంలో ప్రవేశించగా అస్వస్థతకు గురయ్యి ప్రాణాలు కోల్పోయాడు.
కేరళ లోని అలప్పుజా జిల్లా పూచక్కల్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్,షాలిని దంపతుల కుమారుడు గురుదత్ (15) పదవ తరగతి చదువుతున్నాడు.

గత ఆదివారం ఈతకోసం స్థానిక వాగు వద్దకు వెళ్ళినప్పుడు మెదడు తినే అమీబా శరీరంలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు.నెగ్లేరియా ఫౌలెరీ అనే శాస్త్రీయ నామం కలిగి,సాధారణం గా “మెదడు తినే అమీబా” అని పిలిచే నెగ్లేరియా ఫౌలెరీ ఆ బాలుడి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆదివారం నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు గురుదత్ ప్రాణాలు కోల్పోయాడు అని అతని బంధువులు వార్తా సంస్థలకు తెలిపారు. నెగ్లేరియా అనేది స్వేచ్ఛా-జీవన-అమీబా- ఇది ఏక కణ జీవి. ఇది సాధారణంగా సరస్సులు,నదులు,మరియు వేడినీటి కుంటలలో మరియు మట్టిలో జీవిస్తుంది.

నెగ్లేరియా లో ఒక్క జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది అదే నెగ్లేరియా ఫౌలెరీ.నెగ్లేరియా ఫౌలెరీ అనే అమీబా మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఇది మెనింగో ఎన్సెఫాలిటిస్ (PAM ) కి దారితీస్తుంది. ఇది బాధితుడి మరణానికి కారణమవుతుంది. అయితే అలప్పుజా లో కొన్ని సంవత్సరాల క్రింద 2017 లో ఈ వ్యాధి నమోదు అయిందని ప్రముఖ మలయాళ పత్రిక మలయాళ మనోరమ తెలిపింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివైన్సన్ (CDC ) వారి నివేదిక ప్రకారం అమీబాని కలిగిన నీరు ముక్కు ద్వారా శరీరం లోకి ప్రవేశించినప్పుడు నెగ్లేరియా ఫౌలేరీ జనాలకు సోకుతుంది.

సాధారణంగా ఇది ఈత కొట్టడం, నీళ్ళలోకి డైవింగ్ చేయడం లేదా చెరువులు,నదులలో నీటి అడుగున తలలు పెట్టడం వలన అమీబా అప్పుడు ముక్కు ద్వారా మెదడుకు చేరుకుని, మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. అలాగే వినాశకరమైన ఇన్ఫెక్షన్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (PAM )కి దారితీస్తుంది. PAM ఎల్లప్పుడూ ప్రాణాంతకమైనది. అయితే కలుషిత నీటిని త్రాగడం వలన మాత్రం ప్రజలు ఈ వ్యాధి బారిన పడరు.

PAM వ్యాధి లక్షణాలు :
PAM వ్యాధి సంక్రమించిన వారిలో 5 రోజుల తరువాత మొదటి దశ లక్షణాలు మొదలవుతాయి. కానీ అవి 1 నుండి 12 రోజులలోపు బహిర్గతం అవుతాయి. ఈ దశలో తలనొప్పి,జ్వరం,వికారంగా ఉంటుంది అలాగే వాంతులు కలిగే అవకాశం కూడా ఉంది. రెండవ దశలో మెడ గట్టిపడటం,గందరగోళానికి గురవ్వడం,వ్యక్తులు అలాగే పరిసరాలపై శ్రద్ద లేకపోవడం తో పాటు మూర్చలు రావడం,భ్రాంతులు కలగడం,కోమా లోకి వెళ్లడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు కనిపించిన తరువాత వ్యాధి వేగంగా పెరిగి పోతుంది. కేవలం 5 రోజులలో మరణించేంత తీవ్ర మవుతుంది. కొంత మంది వ్యాధి సోకిన రోగులు 18 రోజుల వరకు జీవించి ఉండవచ్చునని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.