PhonePe : వినియోగదారులుకు గుడ్ న్యూస్, యాప్‌లో ‘క్రెడిట్ సెక్షన్’ని ప్రారంభించిన PhonePe

Good news for the users, PhonePe has launched a 'Credit Section' in the app.
image credit : Money Control

Telugu Mirror: వాల్‌మార్ట్ (Wallmart) యాజమాన్యంలోని డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే డిసెంబర్ 21, గురువారం తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త క్రెడిట్ ఆప్షన్ (Phone Pe Credit Option) ని ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు వారి క్రెడిట్ కార్డ్‌ల బిల్లులు, రూపే బిల్స్, మరియు రుణాలను సులువుగా చెల్లించడానికి మరియు వినియోగదారులు వారి క్రెడిట్ స్కోర్‌ (Credit Score) ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా చూడవచ్చు.

అంతే కాకుండా క్రెడిట్ సెంటర్ నుంచి పూర్తి నివేదిక కూడ తెలుసుకోవచ్చు ఎంత క్రెడిట్‌ను ఉపయోగించాము, పెండింగ్ లోన్స్ (Pending Loans) ఏమి ఉన్నాయి, సమయానికి ఎన్ని చెల్లింపులు చేశాం ఇలా మరిన్ని క్రెడిట్ సమాచారం కూడా ఇస్తుందని PhonePe ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలకు క్రెడిట్ పొందడానికి మరిన్ని మార్గాలను అందించడానికి రాబోయే కొద్ది నెలల్లో వినియోగదారుల లోన్లను PhonePe యాప్‌ నుంచే వినయోగించుకునే సదుపాయం అందిస్తునట్లు PhonePe తెలిపింది.

 

image credit: English Jagran

Also Read: House Loans : గృహ రుణాలపై ప్రముఖ 5 బ్యాంక్ లు విధించే వడ్డీ రేట్లు

తరువాత PhonePe యొక్క CEO అయిన హేమంత్ గాలా (Hemanth Galla) మాట్లాడుతూ యాప్‌కు క్రెడిట్ విభాగాన్ని మేము మా వినియోగదారులు ముందుకి మేము తీసుకువచ్చినందుకు సంతోషిస్తున్నాము. ఇది మా కస్టమర్‌లందరి క్రెడిట్ అవసరాలను తీరుస్తూ మా లక్ష్యానికి ఒక్కొక్క అడుగు దగ్గరగా తీసుకువస్తుంది, వారు ఏ రకమైన వ్యాపారమైనా క్రెడిట్ రిపోర్ట్ గురించి తెలుసుకోవడం మరియు శ్రద్ధ వహించడం ద్వారా ఆర్థిక సాధికారత మొదలవుతుందని మేము నమ్ముతున్నాము అని తెలిపారు.

PhonePe ఇపటికే రుణాలు, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌బ్రోకింగ్, బీమా, వంటి ఆర్థిక సేవలను అందిస్తుంది ఇపుడు ఈ క్రెడిట్ ఆప్షన్ వలన మరింత అభివృద్ధి చెందింది. అక్టోబర్‌లో, PhonePe కొత్త మైలురాయిని చేరుకుంది ఏకంగా (UPI) ద్వారా 5 బిలియన్ల కంటే ఎక్కువ లావాదేవీలను మొదటిసారిగా చేసింది.

Also Read : Financial Security : భవిష్యత్తు లో మీ కుమార్తె ఆర్ధిక భద్రత కోసం పెట్టుబడి పెట్టడానికి ముఖ్య మార్గాలు

PhonePe వ్యవస్థాపకుడు మరియు CEO సమీర్ నిగమ్ (sameer nigam) మాట్లాడుతూ మేము మొదటిసారి ఫోన్‌పేని ప్రారంభించినప్పుడు ఇంత తక్కువ సమయంలో 50 కోట్ల మంది వినియోగదారులు అవుతారు అని అసలు ఊహించలేదు అని అన్నారు. “ఇది దాదాపు అధివాస్తవికంగా అనిపిస్తుంది.”అయినప్పటికీ, మేము సగం మాత్రమే చేరుకున్నాము. 100 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం అని CEO సమీర్ నిగమ్ మాట్లాడారు.

డిజిటల్ చెల్లింపుల రంగంలో, కంపెనీ Google Pay, Paytm మరియు Amazon Payకి వ్యతిరేకంగా దూసుకుపోతుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in