నేటి కాలంలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు అందరూ ఉండాలని కోరుకోవడం సహజం దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో జుట్టు (hair) కోసం వాడే ఉత్పత్తులు (products) జుట్టును బలంగా చేయడానికి బదులుగా మరింత దెబ్బతినేలా (damage) చేస్తాయి.
జుట్టు మూలాల నుండి బలహీనంగా (Weakly) మారడం ప్రారంభమైనప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అటువంటిప్పుడు పోషకాహారం తీసుకోవడంతో పాటు రసాయన ఉత్పత్తులను వాడకుండా ఉండటం అవసరం .జుట్టును సహజ పద్ధతి (Natural method) లో బలంగా, ఒత్తుగా, నిగారింపుగా మార్చుకోవచ్చు. నిర్జీవంగా (lifeless) మారిన జుట్టును కాంతివంతంగా కూడా మార్చవచ్చు. మార్కెట్లో లభించే రసాయనాల (chemicals)తో కూడుకున్న ఉత్పత్తులను వాడకుండా, ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి జుట్టును బలోపేతం (strengthen) చేసుకోవచ్చు.
చాలామంది జుట్టు ఆరోగ్యం (health) కోసం కలబంద (Aloe Vera) ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించి నట్లయితే జుట్టు సమస్యలను నివారించవచ్చు.
కలబందను ఉపయోగించి జుట్టుకి ఉపయోగించే చిట్కాల గురించి తెలుసుకుందాం.
కలబంద జెల్ ను తీసుకోవాలి. ఒక గిన్నెలో ఐదు స్పూన్ల- కొబ్బరి నూనె (coconut oil), మరియు మూడు స్పూన్ల -కలబంద జెల్ వేసి కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తలకు మూలాల (of sources) నుండి చివరి వరకు అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా జుట్టుకు ప్రయోజనం కలుగుతుంది.
ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకోవాలి. ఉల్లిపాయను కట్ చేసి రసం (onion juice) తీయాలి. ఈ రసాన్ని అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. కొన్ని రోజుల్లోనే తేడా గమనిస్తారు.
Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా
కలబంద జెల్ (Aloe vera gel)- ఐదు స్పూన్లు మరియు పెరుగు (curd)-ఐదు స్పూన్లు, కొబ్బరి పాలు (Coconut milk)-రెండు స్పూన్లు, బాదం నూనె (Almond oil) కొద్దిగా వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు మూలాల నుండి చివరి వరకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. తరచుగా ఈ విధంగా చేయడం వలన కొన్ని రోజుల్లోనే మార్పు ను మీరే గమనిస్తారు. ఇది చుండ్రు (dandruff) సమస్యను తొలగిస్తుంది. జుట్టు రాలే (Hair loss) సమస్యను నివారిస్తుంది. నిర్జీవంగా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాబట్టి కలబంద జెల్ ను ఈ విధంగా ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…