Hair Grow Faster : “బయోటిన్ పౌడర్” మీ జుట్టును మందంగా పెంచుతుంది, చర్మానికి అందాన్ని ఇస్తుంది, వాడి చూడండి తేడా తెలుసుకోండి

చాలామంది జుట్టు రాలే సమస్యను కలిగి ఉంటారు. కొంతమంది విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు జుట్టు రాలకుండా అయితే సహజంగా దొరికే పదార్ధాలతో బయోటిన్ పౌడర్ తయారు చేసుకుని వాడితే జుట్టురాలే సమస్య తగ్గిపోతుంది అలాగే చర్మ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి.

ప్రతి ఒక్కరికి తాము అందంగా, తెల్లగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే జట్టు రాలకుండా బలంగా, ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలని కోరుకోవడం కూడా సహజం. ముఖం మీద మొటిమలు, మచ్చలు మరియు నిర్జీవంగా ఉన్నవారు అలాగే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు ఈ పొడిని తయారు చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే చర్మం మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ పొడి పేరు బయోటిన్ పౌడర్.

కొంతమంది బయోటిన్ (Biotin) సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అయితే ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి సహజ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

బయోటిన్ పౌడర్ కు కావలసిన పదార్థాలు:

బాదం- ఒక కప్పు, వాల్ నట్స్ – ఒక కప్పు, గుమ్మడి గింజలు- ఒక కప్పు, జీడిపప్పు- అర కప్పు, పుచ్చ గింజలు -అరకప్పు, అవిస గింజలు- అరకప్పు, పల్లీలు- రెండు స్పూన్లు, చియా సీడ్స్- రెండు స్పూన్లు, నువ్వులు- ఒక స్పూన్.

Hair Grow Faster : "Biotech Powder" Grows Your Hair Thicker, Makes Your Skin Beautiful, Try It and Know the Difference
Image Credit : Pinterest

తయారీ విధానం:

స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి సన్నని మంట మీద ఈ పదార్థాలు అన్నింటిని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించాలి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టాలి ఈ పొడిని గాలి చొరబడని (Airtight) సీసాలో భద్రపరుచుకోవాలి ఈ పొడిని రోజు క్రమం తప్పకుండా ఒక స్పూన్ తింటే శరీరానికి అవసరమైన బయోటిన్ తేలికగా లభిస్తుంది. ఈ పొడి చర్మానికి, జుట్టుకి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

బయోటిన్ పౌడర్ ఉపయోగాల గురించి తెలుసుకుందాం:

బయోటిన్ లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ -హెచ్, ఎమైనో యాసిడ్స్ మరియు ఫ్యాటీ ఆసిడ్స్ ఉండటం వల్ల ఇవి చర్మాన్ని మరియు జుట్టుని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. బయోటిన్ పౌడర్ చర్మం ను కాంతివంతంగా మారుస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరగడానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు.

Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

ఈ పౌడర్ ని తీసుకోవడం వల్ల చర్మానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ పొడి (Powder) ని రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొంతమందికి చర్మం పై పొలుసులు (scales) దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇవి శరీరంలో బయోటిన్ లోపం వల్ల వస్తాయి. అలాంటివారు కూడా ఈ పొడిని వాడవచ్చు. బయోటిన్ పౌడర్ లో విటమిన్- హెచ్ ఉండడం వల్ల శరీరంలో వచ్చే ప్రతికూల పరిస్థితిని అడ్డుకుంటుంది. అలాగే నట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

బయోటిన్ పౌడర్ జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం:

బయోటిన్ పౌడర్ ను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. జుట్టు మందంగా కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read : తెల్ల జుట్టును, కేశ సమస్యను మాయం చేసే గోరింటాకును వాడండి ఇలా

ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటూ రోజువారి ఆహారంలో పాలు, కూరగాయలు, సోయాబీన్స్, మాంసాహారం, చేపలు వంటివి కూడా ఉండేలా చూసుకోవాలి వీటి వలన జుట్టు రాలడం (hair loss) తగ్గుతుంది. ఇవి మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
కాబట్టి ప్రతి ఒక్కరు తమ చర్మాన్ని, జుట్టుని ముఖ్యంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే మన ఆహారంలో ఇటువంటి ఆహార పదార్థాలను భాగంగా చేర్చుకోవాలి.

Comments are closed.