జై బోలో గణేష్ మహరాజ్ కీ , ఘనంగా మొదలయిన వినాయక నిమర్జనం కార్యక్రమాలు

వినాయక నిమర్జనం వెనుకున్న అసలు పరమార్థం ఇదే మరియు నిమర్జన కార్యక్రమాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : వినాయకచవితి పండుగ అంటే చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు తెలియని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సెప్టెంబర్ 18 2023 న  వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇక ఇప్పుడు నిమర్జన కార్యక్రమాలకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఈరోజు వినాయక నిమర్జనం ఎందుకు జరుపుతారు మరియు ఆ రోజున ఎటువంటి జాగ్రత్తలు (Precautions) అనుసరించాలి అనే విషయాన్నీ తెలుసుకుందాం.

Also Read : To Day Panchangam September 27, 2023 భాద్రపద మాసంలో త్రయోదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వినాయకుడిని నీటిలోనే నిమర్జనం చేయడానికి ముఖ్య కారణం ఏంటి మరియు దాని విశేషాలను గురించి  తెలుసుకుందాం. వినాయక నిమర్జనం రోజున మేళ తాళాల నడుమ డీజే బాక్స్ లతో ఘనంగా ఊరేగిస్తూ దగ్గరలో ఉండే చెరువుల్లో, నదుల్లో , కాలువల్లో నిమర్జనం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వినాయక చవితి పండుగని వర్షాకాలంలో జరుపుకుంటారు ఎందుకంటే నదుల్లో లేదా చెరువుల్లో ఉండే మట్టిని సేకరించడం వలన ఆ నదులు చెరువుల యొక్క లోతు పెరుగుతుంది. తర్వాత అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉన్న క్రిములు నశించి పరిశుభ్రమైన నీటిగా మారుతాయని కొంత మంచి భావిస్తారు.
అయితే పండితులు ఎం చెబుతున్నారంటే, మట్టితో తయారు చేయబడ్డ విగ్రహం తొమ్మిది రోజుల తర్వాత నిజమర్జనం చేయాలి లేకపోతే దైవత్వం మాయమవుతుందని చెప్పారు. అనంతర చతుర్దశి తర్వాత వినాయకుడు తన తల్లి దండ్రుల వద్దకు చేరుకుంటాడు నిమర్జనం చేస్తే ఇంట్లో ఉండే మరియు అందరి జీవితాల్లో ఉండే కష్టాలు మాయమవుతాయని ఒక నమ్మకం.

this-is-the-real-meaning-behind-vinayaka-nimarjana-and-now-let-us-know-the-precautions-to-be-taken-during-nimarjana-programs
Image Credit : Timesalert

ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే ప్రజలు నిమర్జన సంబరాల్లో మునిగిపోయి తగిన జాగ్రత్తలు  పాటించక పోవడం వల్ల పండుగ రోజున బాధ పడే సందర్భాలు మనం ఎన్నో చూసే ఉంటాం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వినాయక నిమర్జనాన్ని సంతోషంగా జరుపుకోవచ్చు. ముందుగా ఊరేగింపు చేసే సమయం లో కనీసం ఇద్దరయిన బాధ్యత వహించాలి. ఒకరు సరియైన విధంగా ఊరేగింపు జరుగుతుందా లేదా అనే విషయాన్నీ చూసుకుంటే మరొకరు ట్రాఫిక్ (Traffic) నియంత్రణ విషయాన్నీ గమనిస్తూ ఉంటారు. ఊరేగింపు సాఫీగా జరగాలంటే కనీసం ఒక అయిదుగురు రెండు వైపులా తాడులు పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ హడావుడిలో చిన్న పిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారు ఆ జనసందానం (Crowd) లో తల్లిద్రండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఊరేగింపు సమయం వాటర్ తో పాటు ప్రథమ చికిత్స బాక్స్ ని కూడా అందుబాటులో ఉండేవిదంగా చూసుకోండి.

Also Read : ఈరోజు ఈ రాశి వారికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి కనుక డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. మరి ఇతర రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

బహిరంగమైన, విశాలమైన ప్రదేశంలో బాణాసంచా (Fireworks) కాల్చడానికి అనుకూలంగా ఉందా లేదా  అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. రోడ్లమీద జనసంచారం కలిగి ఉండటం వల్ల ఇది ప్రమాదకరమైనది కావచ్చు. చిన్నపిల్లలను  బాణసంచాలకు దూరంగా ఉండేటట్లు తప్పనిసరిగా చూసుకోవాలి.

విగ్రహం పెద్దగా ఉంటే నిమర్జనం చేసేటప్పుడు ఒక పడవ సహాయం తీసుకోండి. ఈత (Swimming) వచ్చిన వారు మాత్రమే నీటిలోకి దిగాలి. విగ్రహాన్ని నీటిలో వేసేటప్పుడు ఆయా విగ్రహానికి ఉన్న పూల దండలు, పూలు తీసేయాలి. విగ్రహాలు కొనుగోలు చేసేటప్పుడు పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్న విగ్రహం అయిన పెద్ద విగ్రహం అయిన దేవుని ఆశీర్వాదాలు అందరికి ఒకే విధంగా ఉంటాయి.

Comments are closed.