Types of Wheel Drives : కార్స్ లో ఫ్రంట్-వీల్, రేర్-వీల్, ఫోర్-వీల్ మరియు ఆల్-వీల్ డ్రైవ్స్, ఇన్ని రకాలు ఉన్నాయా?

Wheel Drive Typesమీరు కార్ కొనే ముందు ఆ కార్ మీరు దేనికి యూజ్ చేస్తారు, మీకు అసలు ఎలాంటి పరిస్థితుల్లో కార్ అనేది ఎక్కువ యూజ్ చేయబడుతుంది మరియు మీకు ఆ కార్ నుంచి ఎంత పవర్ అవసరం అనే వాటి మీద కార్ యొక్క డ్రైవ్ టైప్ అనేది ఆధారపడి ఉంటుంది.

Best 4 Wheel Drive Types :  మీకు మనం రోజు చూసే కార్స్ లో ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD), రేర్-వీల్ డ్రైవ్ (RWD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అని ఇన్ని రకాలు ఉంటాయి అని తెలుసా?

మీరు కార్ కొనే ముందు ఆ కార్ మీరు దేనికి యూజ్ చేస్తారు, మీకు అసలు ఎలాంటి పరిస్థితుల్లో కార్ అనేది ఎక్కువ యూజ్ చేయబడుతుంది మరియు మీకు ఆ కార్ నుంచి ఎంత పవర్ అవసరం అనే వాటి మీద కార్ యొక్క డ్రైవ్ టైప్ అనేది ఆధారపడి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Front-Wheel Drive(FWD) : FWD అనేది ఇంజిన్ కార్ ని ముందు నుంచి పుష్ చేయటం లాంటిది. ఇందులో ఇంజిన్ అనేది కార్ యొక్క ఫ్రంట్ వీల్స్ కి మాత్రం ఏ పవర్ సప్లై చేస్తుంది. FWD రోజువారీ డ్రైవింగ్‌కు మంచిది మరియు ఇంజిన్ వెనుక టైర్స్ కి పవర్ పంపాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్యూయల్ ని ఆదా చేస్తుంది.

చాలా చిన్న కార్లు మరియు కుటుంబ కార్లు FWDని ఉపయోగిస్తాయి ఎందుకంటే ఇది రెగ్యులర్ డ్రైవింగ్‌కు చాలా కంఫర్ట్ మరియు ఈజీ. అయితే, మీరు ఎక్కువ యాక్సిలరేషన్ చేసినప్పుడు, కారు ముందు నుండి లాగినట్లు అనిపించవచ్చు, దీనిని టార్క్ స్టీర్ అంటారు. ఫ్రంట్-వీల్ డ్రైవ్ మనం రెగ్యులర్ గ చూసే హచ్ బ్యాక్ లాంటి మారుతి స్విఫ్ట్, బాలెనొ ఇంకా క్రెటా లాంటి యస్ యూవీ, మరియు సేడన్స్ లలో చూడవచ్చు.

Rear-Wheel Drive(RWD) : RWD అనేది ఇంజిన్ కార్ ని వెనుక నుండి పుష్ చేయటం లాంటిది. ఇందులో ఇంజిన్ అనేది కార్ యొక్క రేర్ వీల్స్ కి మాత్రం ఏ పవర్ సప్లై చేస్తుంది. మీరు వెనుక నుండి నెట్టబడే షాపింగ్ కార్ట్‌ను ఊహించుకోండి.

నడిపించడం కొంచెం కష్టం, కానీ మీరు వేగంగా వెళ్లాలనుకున్నప్పుడు లేదా షార్ప్ టర్న్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది చక్కటి కంట్రోల్ ని ఇస్తుంది. అందుకే స్పోర్ట్స్ కార్లు మరియు కొన్ని ట్రక్కులు RWDని ఉపయోగిస్తాయి.

RWD కార్లు “డ్రిఫ్ట్” కూడా సులభంగా చేయగలవు, అంటే కంట్రోల్డ్ స్పీడ్లో ఒక పక్కకి జరగడం, ఇది ఎక్కువ స్టాంట్స్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ RWD కార్లు మంచుతో నిండిన లేదా తడిగా ఉన్న రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వెనుక చక్రాలు మరింత సులభంగా పట్టును కోల్పోతాయి.

ఇవి ఫ్రంట్-వీల్ డ్రైవ్(FWD) కార్స్ కన్నా ఎక్కువ ధర ఉంటాయి, అందుకే ఈ రేర్-వీల్ డ్రైవ్(RWD) కార్స్ ని ఇండియా లో కేవలం లగ్జరీ కార్స్ లోనే చూస్తాం, మిడ్ రేంజ్ లో ఇవి చాల తక్కువ కనిపిస్తాయి. ఆడి, బెంజ్,BMW లాంటి కంపెనీలు ఎక్కువగా వీటిని తయారు చేస్తాయి.

Four-Wheel Drive(4WD) :4WD లో ఇంజిన్ కార్ యొక్క నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. మట్టి లేదా మంచు వంటి కఠినమైన పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది. చాలా 4WD కార్ లలో 2WD కి మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటది, రెగ్యులర్ రోడ్స్ లో ఫ్రంట్ టైర్స్ వరకు యూజ్ చేసుకొని ఆఫ్ రోడ్ కి వెళ్లాలనుకున్నపుడు వెనక టైర్స్ కూడా యూజ్ చేస్కోవచ్చు.

ఇలా 2WD మరియు 4WD మధ్య మారవచ్చు, కాబట్టి మీరు సాధారణ రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గ్యాస్ ఆదా చేయవచ్చు. కానీ 4WD కారును బరువుగా మరియు తక్కువ ఫ్యూయల్-ఎఫిసియెంట్ గ చేస్తుంది ఎందుకంటే అన్ని టైర్స్ కి పవర్ ని పంపడానికి ఎక్సట్రా పవర్ అవసరం.
మనం 4WD ని టొయోట ఫార్చునర్ మరియు మహింద్ర థార్ లో చూడవచ్చు.

Best 4 Wheel Drive Types

All-Wheel Drive (AWD) : అల్-వీల్ డ్రైవ్ (AWD) 4WD లాగానే ఉంటుంది, కానీ ఇది రెగ్యులర్ రోడ్లకు ఎక్కువ. ఇది అన్ని వీల్స్ కి పవర్ సప్లై చేయగలదు, అందుకే ఇందులో నాలుగు టైర్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇది జారే రోడ్లపై ట్రాక్షన్‌ కంట్రోల్ సహాయం తో చక్కని గ్రిప్ ఇస్తుంది. SUVలు మరియు క్రాస్‌ఓవర్‌లలో AWD సర్వసాధారణం ఎందుకంటే వర్షం లేదా మంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది మీకు మరింత కంట్రోల్ ని ఇస్తుంది.

AWD కంట్రోల్స్ చాలా సమయలో మారవచ్చు. కొన్ని మీకు మరింత గ్రిప్ అవసరమైనప్పుడు వెనుక టైర్స్ కి ఎక్కువ పవర్ ని పంపగలవు, మరికొన్ని నార్మల్ గ అన్ని టైర్స్ కి సమానంగా పవర్ ని పంపుతాయి. మహీంద్రా XUV 700 మరియు టయోటా అర్బన్ క్రూయిసర్ లో మీరు AWD ని చూడవచ్చు.

ఎలాంటి డ్రైవ్ మోడ్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీకు మీ కారు నుండి ఏమి అవసరమో దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు చాలా మంచు లేదా వర్షం ఉన్న ప్రదేశంలో నివసిస్తుంటే, AWD ఉత్తమమైనది కావచ్చు.

మీరు ఎక్కువ ఆఫ్ రోడ్ యూజ్ చేస్తారు అనుకుంటె 4WD బాగుంటుంది, మీరు వేగంగా నడపడానికి సరదాగా ఉండే కారు కావాలంటే, RWD మరింత ఉత్సాహంగా ఉంటుంది. రోజువారీ డ్రైవింగ్ మరియు మంచి మైలేజ్ కోసం, FWD ఒక మంచి ఛాయిస్.

Drivetrain Description Example Vehicles
Front-Wheel Engine power goes to the front wheels. Good for everyday driving and fuel-efficient. Can experience torque steer. Most small cars and family cars
Rear-Wheel Drive Engine power goes to the rear wheels. Provides a more fun driving experience and better for high-performance vehicles. Can be tricky on slippery roads. Sports cars, some trucks
Four-Wheel Drive Can send power to all four wheels. Great for off-road and tough conditions. Can switch between 2WD and 4WD. Adds weight and complexity to the vehicle, which can reduce fuel efficiency. SUVs, trucks designed for off-road use
All-Wheel Drive Can send power to all four wheels. Great for off-road and tough conditions. Can switch between 2WD and 4WD. Adds weight and complexity to the vehicle, which can reduce fuel efficiency. Common in SUVs

 

Comments are closed.