Car Breaks Failure: కారు నడుపుతున్నారా? సడన్ గా బ్రేక్స్ ఫెయిల్ అయితే..? చిటికలో పరిష్కారం

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఈ టిప్స్ ను పాటించండి. వివరాల్లోకి వెళ్తే..

Car Breaks Failure: ఈరోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి వాహనాలు ఉంటూనే ఉన్నాయి. వాహనాల (Vehicles) వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది.  ఎక్కడకి వెళ్లాలన్నా వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం వాహన తయారీ కంపెనీలు (Vehicle Manufacturing Companies) కూడా రక రకాల మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.

అయితే, మీరు కారు డ్రైవ్ చేస్తున్నారా? ఎంత మంచి కారు కొన్న అధిక వినియోగం వల్ల లేదా ఇతర ఏవైనా కారణాల వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తుతాయి. అయితే, కార్ డ్రైవ్ (Car Drive) చేస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? ఆ సమయంలో ఏం చేయాలి? ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రేక్ ఫెయిల్ (Break Fail) అయిన సందర్భంలో ఏమి చేయాలో తోచదు. కంగారు బాగా పెరుగుతుంది. కార్ లో నుండి దూకుదామా లేక మరేదైనా చేయాలా అనే ఆలోచనలు వస్తు ఉంటాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ బ్రేకులు (Brakes) అనుకోకుండా ఫెయిల్ అయితే మీరు ఏమి చేస్తారు?

Also Read: Lower Berth Seats: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, రైలు ప్రయాణంలో లోయర్ బర్త్ సీట్లు ఎలా పొందాలంటే?

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ బ్రేకులు ఫెయిల్ (Breaks) అయితే భయపడవద్దు. కారు నుండి దూకడానికి బదులుగా, ప్రశాంతంగా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అనే వాటిపై దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత, మీరు కారులో కూర్చొని దాన్ని ఆపవచ్చు. బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే, మొదటగా చేయాల్సిన పని… కారు ప్రమాద హెచ్చరిక లైట్లను ఆన్ (Lights On) చేయండి. ఈ వాహనంలో ఏదో లోపం ఉందని మీ చుట్టూ ఉన్న కార్లకు ఇది హెచ్చరిస్తుంది.

అప్పుడు మీరు చేయాల్సిందల్లా స్టీరింగ్‌ (Stering) ను కరెక్ట్ గా నడపడమే. స్టీరింగ్ కరెక్ట్ గా తిప్పితేనే  కారు సరైన దిశలో ప్రయాణించేలా చేస్తుంది. ప్రమాదాలను ఎక్కువ కాకుండా ఉంటాయి. మరో చేత్తో మెకానికల్ హ్యాండ్‌బ్రేక్‌ (Hand Break) ను పట్టుకుని, బటన్‌ను లోపలికి నొక్కండి. దాన్ని పైకి క్రిందికి నెడుతూ ఉండండి. హ్యాండ్‌బ్రేక్‌ను చాలా తరచుగా పైకి క్రిందికి నెట్టడం వలన కారు తొందరగా ఆగిపోతుంది.

Comments are closed.