P-Sport Electric Bike : మేడ్ ఇన్ ఆంధ్ర బైక్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ సూపర్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ బైక్ అయిన పీ-స్పోర్ట్స్ బైక్ గురించి తెలుసుకుందాం.

P-Sport Electric Bike : ప్రస్తుత టెక్ దిగ్గజ ప్రపంచంలో కొత్త కొత్త వాహనాలను,స్మార్ట్ ఫోన్లను  చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, ఆటోలు ఇలా అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ గా తయారు చేస్తున్నారు. టూ- వీలర్ విషయానికి ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం అంతగా లేదు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో తయారు అయిన మేడ్ ఇన్ ఆంధ్ర ఎలక్ట్రిక్ బైక్ (Made in andhra Electric Bike) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేడ్ ఇన్ ఆంధ్ర ఎలక్ట్రిక్ బైక్ 

ఆంధ్ర బైక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బైక్ లుక్ చూస్తే యూత్ ని వెంటనే ఆకర్షించేలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ పవర్ ఈవీని మొదట భారత దేశంలోనే విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు పీ-స్పోర్ట్స్ బైక్ .ఈ బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి 150 కీ.మీ రేంజ్ వేరియంట్ మరొకటి 210 కీ.మీ రేంజ్ వేరియంట్ తో వస్తుంది. పీ-స్పోర్ట్స్ బైక్ యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

పీ-స్పోర్ట్స్ బైక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 

పీ-స్పోర్ట్స్ బైక్ (P-Sport Bike) నిర్మాణం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు తగినట్టుగా ఉంటుంది. ఎయిర్ కూల్డ్ బ్యాటరీ సాంకేతికతతో అమర్చారు. బైక్‌తో ఏవైనా ఇబ్బందులు ఉంటే యజమాని/రైడర్‌ను చెక్  చేసి, హెచ్చరించే సెల్ఫ్ -డయాగ్నలైజ్ సాంకేతికతను కలిగి ఉంది.

P-Sport Electric Bike

అలాగే అన్ని సమయాల్లో బ్యాటరీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి వ్యక్తిగతీకరించిన మొబైల్ యాప్ తో  యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ఉంది. వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ, బ్యాటరీ స్వాప్ మరియు ఒక సంవత్సరం ఫ్రీ సర్వీస్ వంటి ఫీచర్లను కంపెనీ తన కస్టమర్లకు అందిస్తుంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సిటీ  అంతటా అనేక వేగవంతమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

ఈ బైక్ 72V – 33.6Ah మార్చుదాగిన బ్యాటరీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించి పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 210 కీ.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్ 4.8 kW శక్తిని కలిగి ఉంది.

ఇది 6 సెకన్లలో గంటకు 0 నుండి 85 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 210 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మిగిలిన EV కంపెనీలలో ఇది భారతదేశంలో అత్యుత్తమైనది. గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.

పీ-స్పోర్ట్ బైక్ లో  ఎకో, స్టాండర్డ్ మోడ్ మరియు టర్బో వంటి మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్).

P-Sport Electric Bike

Comments are closed.