Tata Safari vs Mahindra XUV700, Outstanding Comparison: మహీంద్రా XUV 700 మరియు లేటెస్ట్ టాటా సఫారీ మధ్య డిఫరెన్స్ మీ కోసం.

Tata Safari vs Mahindra XUV700

Tata Safari vs Mahindra XUV700: ఇండియన్ మార్కెట్లో ఎప్పటి నుంచో మహీంద్రా XUV 500 దాని మార్క్ ని సెట్ చెసింది, అయితే మహీంద్రా ఇప్పుడు దాని లేటెస్ట్ మోడల్ అయిన XUV 700 తో ఇంకో మార్క్ ని సెట్ చేయబోతుంది, కానీ మార్కెట్ లో ఇప్పటికే ఈ వెహికల్ కి పోటీగా చాల కంపెనీ SUVs ఉన్నాయ్, అందులో ఒకతె టాటా సఫారీ, ఇప్పుడు XUV 700 మరియు టాటా సఫారీ యొక్క ఫీచర్స్, పెర్ఫార్మన్స్, ఇంజిన్, డిజైన్ వంటి విషయాలు పోల్చి చూద్దాం.

Tata Safari Facelift:

Exterior:
-టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా కొత్త లుక్ తో వస్తుంది, XUV700తో పోలిస్తే ఇది మరింత లేటెస్ట్ మరియు అద్భుతమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
-ఈ వెహికల్ యొక్క హెడ్‌లైట్స్ ప్రొజెక్టర్ LED లతో వస్తుంది, మెరుగైన విజిబిలిటీ మరియు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
-సఫారి ఫేస్‌లిఫ్ట్ 19-ఇంచ్ టైర్‌ల తో వస్తుంది, ఇది దాని సెగ్మెంట్లో అతి పెద్దది, XUV700తో పోలిస్తే అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది.

Interior:
-సఫారి ఫేస్‌లిఫ్ట్ దాని బ్రౌన్ మరియు ఐవరీ కలర్ స్కీమ్‌తో ప్రీమియం లుక్ అందిస్తుంది.
-ఇంటీరియర్ సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లను కలిగి ఉంటుంది, ఇది లగ్జరీ ఫీల్ ని ఇస్తుంది.
-స్టీరింగ్ వీల్ పూర్తిగా లైటింగ్ తో ఉంటుంది, ఇది క్యాబిన్ కి ఇంకా ప్రీమియం లుక్ ని ఇంకా పెంచుతుంది.
-సఫారి ఫేస్‌లిఫ్ట్ 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది దాని విభాగంలో అతిపెద్దది కానప్పటికీ, ప్రీమియం అనుభూతిని మరియు హై-క్వాలిటీ డిస్ప్లే అందిస్తుంది.

Features:
-సఫారి ఫేస్‌లిఫ్ట్ దాని సెగ్మెంట్ లో సాధారణంగా కనిపించని 45W ఛార్జర్‌తో సహా వివిధ రకాల ఫీచర్లతో లోడ్ చేయబడింది.
-ఇది అలెక్సా, గూగుల్ మరియు సిరితో వాయిస్ కంట్రోల్ ఫంక్షనాలిటీని కూడా అందిస్తుంది.
-సన్ బ్లైండ్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు సఫారి ఫేస్‌లిఫ్ట్ యొక్క మొత్తం లుక్ మరియు కంఫర్ట్ ని పెంచుతాయి.
-సఫారి ఫేస్‌లిఫ్ట్ కెప్టెన్ సీట్ ఆప్షన్ కూడా అందిస్తుంది, ప్రీమియం మరియు సౌకర్యవంతమైన SUV కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు ఏది ఒక ప్రీమియం SUV గ కనిపిస్తుంది.

Space and Comfort:
-టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ ఏడుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది, మూడు వరుసలలో తగినంత స్థలం ఉంటుంది.
-సీట్లు చక్కగా డిజైన్ చేయబడ్డాయి మరియు మంచి సపోర్ట్ అందిస్తాయి, ప్రయాణీకులకు లాంగ్-జర్నీస్
కంఫర్ట్ గ ఉంటాయి.
-సఫారి ఫేస్‌లిఫ్ట్ యొక్క మూడవ వరుస పొడవాటి ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుంది, ఈ సెగ్మెంట్ SUVలలో ఇలా చాల వాటికీ ఉండదు.

Engine: సఫారీ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది, ప్రస్తుతం పెట్రోల్ ఆప్షన్ లేదు.

Transmission: 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ప్యాడిల్ షిఫ్టర్స్ తో వస్తుంది.

Steering: ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్, ఓల్డ్ హైడ్రాలిక్ స్టీరింగ్‌తో పోలిస్తే తేలికైనది మరియు డ్రైవ్ చేయడానికి ఈజీ గ ఉంది.

Driving Experience: సఫారీ ఫేస్-లిఫ్ట్ లో తగ్గిన వైబ్రేషన్స్ మరియు స్మూత్ హ్యాండ్లింగ్ తో పాటు మెరుగైన డ్రైవింగ్ ఫిల్ ని ఇస్తుంది. స్పోర్ట్ మోడ్ లో ఎక్స్ట్రా పవర్ ని ఇస్తుంది.

Ride Quality: 18-ఇంచ్ వీల్స్ నుంచి 19-ఇంచ్ కి చేంజ్ చేయడం వాళ్ళ రైడ్ క్వాలిటీ చాల ఇంప్రూవ్ ఐంది.

High-Speed Stability: మంచి హై-స్పీడ్ స్టెబిలిటీ, హై-స్ప్డ్స్ లో కూడా నడపడం సులభం.

Fuel Efficiency: XUV700తో పోలిస్తే మెరుగైన ఫ్యూయల్-ఎఫిసిఎన్సీ ఇస్తుంది, ​​సిటీ మైలేజ్ 10-12 kmpl మరియు హైవే మైలేజ్ 16-17 kmpl.

Tata safari overall view:
ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ లో మరిన్ని ఫీచర్లు మరియు వాల్యూ ఫర్ మనీ గ ఈ వెహికల్ చాల మందిని ఆకర్షిస్తుంది. మంచి బ్యాలెన్స్ ఫీచర్లు మరియు అందుబాటు ధరతో 7-సీటర్ కోసం చూస్తున్న వారికి అనువైనది.

Mahindra XUV700:

Exterior:
-మహీంద్రా XUV700 టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్‌తో పోలిస్తే కొంచం తక్కువ స్టైలింగ్‌ను కలిగి ఉంది, తక్కువ బోల్డ్ మరియు అద్భుతమైన డిజైన్‌తో ఉంటుంది.
-ఈ వెహికల్ లో హెడ్‌లైట్‌ల కోసం సాధారణ LEDs ని
యూజ్ చేసారు. సఫారి ఫేస్‌లిఫ్ట్ ప్రొజెక్టర్ LED ల లాగా ప్రీమియం లుక్ ని అందించదు.
-XUV700 18-ఇంచ్ టైర్స్ తో వస్తుంది, ఇవి సఫారి ఫేస్‌లిఫ్ట్ యొక్క 19-ఇంచ్ టైర్ల కంటే కొంచెం చిన్నవి.

Interior:
-XUV700 సాఫ్ట్ మరియు హార్డ్ ప్లాస్టిక్‌ల కాంబినేషన్ లో బ్లాక్ మరియు ఐవరీ ఇంటీరియర్‌తో వస్తుంది.
-XUV700 యొక్క ఇంటీరియర్ డిజైన్ దీనికి ఫ్యూచరిస్టిక్ లుక్ ని ఇస్తుంది, రెండు స్క్రీన్స్ తో వస్తుంది (ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), ప్రత్యేకమైన మరియు మోడరన్ ఫీల్ ని ఇస్తాయి.
-XUV700 యొక్క స్టీరింగ్ వీల్ టచ్ మరియు గ్రిప్‌కు బాగుంది, ఇది మంచి డ్రైవింగ్ ఫీల్ ని మరియు కంఫర్ట్ ని ఇస్తున్నాయి.
-XUV700 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది మంచి డిస్‌ప్లే అయినప్పటికీ, దీని UI మరియు అప్షన్స్ ని యూజ్ చేయడం కొంచం కష్టం గ ఉండవచ్చు.

Features:
-XUV700 సోనీ 12-స్పీకర్ సిస్టమ్‌తో 3D సరౌండ్ సౌండ్‌తో వస్తుంది, దాని సెగ్మెంట్ లో ఏ వెహికల్ కి లేని మంచి ఆడియో సిస్టం తో వస్తుంది.
-ఇది అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది, వినియోగదారులకు కారు యొక్క వివిధ ఫీచర్స్ ని కంట్రోల్ చేయడానికి మంచి ఆప్షన్ ఇచ్చింది.
-XUV700 ప్రత్యేకమైన యాప్‌లు మరియు ఫీచర్‌లను కూడా అందిస్తుంది, ఎక్కువ టెక్నాలజీ ఉన్న SUV కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు మంచి ఆప్షన్ గ ఈ వెహికల్ కనిపిస్తుంది.

Space and Comfort:
-మహీంద్రా XUV700 విశాలమైన రెండవ వరుసను అందిస్తుంది, విశాలమైన లెగ్ రూమ్ మరియు ప్రయాణీకులకు హెడ్‌రూమ్ ఉంది.
-అయితే, XUV700 యొక్క మూడవ వరుస అంత విశాలంగా లేదు, ఇది పొడవైన ప్రయాణాలకు హైట్ ఉన్న వాళ్ళకి తక్కువ కంఫర్ట్ గ ఉంటుంది.
-XUV700 యొక్క పెద్ద గ్లాస్ ఏరియా ఈ కార్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఓపెన్ ఫీల్ ని ఇస్తుంది. అయితే ఇది
ఎక్కువ సన్ కి ఎక్సపోజ్ అయేల చేస్తుంది. ఇది కొంతమంది వినియోగదారులకు నచ్చక పోవచ్చు.

https://twitter.com/MahindraXUV700/status/1754484920330944790?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1754484920330944790%7Ctwgr%5E549ad8cef1800646e0f9fede51278b4af1f59da6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FMahindraXUV700%2Fstatus%2F1754484920330944790

Engine: 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (200 bhp) మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ (185 bhp, 450 Nm). అప్షన్స్ తో వస్తుంది.

Transmission: డీజిల్ ఆటోమేటిక్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

Steering: రెగ్యులర్ స్టీరింగ్ మాదిరిగానే లైట్ గ మరియు ఈజీ గ యూజ్ చేయవచ్చు.

Suspension: సఫారితో పోలిస్తే సస్పెన్షన్ స్మూత్ గ ఉంది, దీని వాళ్ళ తక్కువ వేగంతో సాఫీగా ప్రయాణించవచ్చు, అయితే రఫ్ రోడ్లపై ఎక్కువ సౌండ్ రావచ్చు.

Driving Experience: ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో మంచి పికప్ తో మంచి ఎఫర్ట్ లేని డ్రైవ్ ఫీల్ ని ఇస్తుంది.

High-Speed Stability: సఫారి మాదిరిగానే మంచి హై-స్పీడ్ స్టెబిలిటీ ఉంది.

Fuel Efficiency: సఫారితో పోలిస్తే కొంచెం తక్కువ ఫ్యూయల్-ఎఫిసిఎన్సీ ఇస్తుంది, ​​సిటీ మైలేజ్ 10-11.5 kmpl మధ్య మరియు హైవే మైలేజ్ 16-18 kmpl మధ్య ఉంటుంది.

Mahindra XUV700 Overall View:
మహీంద్రా XUV700 దాని కేటగిరీలో అత్యంత పవర్ఫుల్ పెట్రోల్ ఇంజన్, అలాగే డీజిల్ ఆటోమేటిక్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందిస్తుంది. అలాగే మంచి పెర్ఫార్మన్స్ మరియు సౌకర్యవంతమైన SUV కోసం చూస్తున్న వారికి బాగుంటుంది.

final review:

టాటా సఫారి దాని మెరుగైన డ్రైవింగ్ ఫీల్, మెరుగైన రైడ్ క్వాలిటీ మరియు మంచి ఫ్యూయల్ ఎఫిసియెంట్ వెహికల్ గ ఏంటో మందిని ఆకర్షిస్తుంది. మహీంద్రా XUV700 శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ మరియు మరింత క్వాలిటీ డ్రైవింగ్ ఫీల్ అందించడంలో, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో అత్యుత్తమంగా ఉంది. XUV700 పెర్ఫార్మన్స్ మరియు డ్రైవింగ్ ఫీల్ కి ప్రాధాన్యతనిస్తుండగా, సఫారి ఫీచర్లు మరియు బడ్జెట్ పై దృష్టి సారించడంతో రెండు కార్లు వాటి బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. వాటి మధ్య ఎంపిక వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

Tata Safari vs Mahindra XUV700 Specifications:

Specification Tata Safari Mahindra XUV700
Engine 2.0-litre diesel 2.0-litre turbo petrol (200 bhp)
2.2-litre diesel (185 bhp, 450 Nm)
Transmission 6-speed manual
6-speed automatic with paddle shifters Manual
Automatic (Diesel with all-wheel drive option)
Steering Electronic steering Light and easy to maneuver, similar to a car’s steering
Driving Experience Improved with reduced vibrations and smoother handling
Sport mode offers extra power Effortless drive, especially in city traffic, with good initial pull
Ride Quality Improved despite switch to 19-inch wheels
Soft and comfortable Softer suspension, smoother ride at low speeds but may produce more noise on bad roads
High-Speed Stability Good Good
Fuel Efficiency City: 10-12 kmpl
Highway: 16-17 kmpl City: 10-11.5 kmpl
Highway: 16-18 kmpl

Tata Safari and Mahindra XUV700 Comparison

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in