Yamaha R3 and MT-03, Magnificent comparison: యమహా నుంచి త్వరలో రాబోతున్న కొత్త మోడల్స్ యొక్క డిజైన్, పవర్ ఇంకా పూర్తి డీటెయిల్స్ మీ కోసం.

యమహా ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న R3 మరియు MT-03 మోడళ్లను తీస్కొని వచ్చింది, బ్రాండ్ యొక్క రేసింగ్ DNA మరియు ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను ఎలివేట్ చేసే విధంగ ఈ వెహికల్స్ ఉన్నాయ్.

Yamaha R3 and MT-03

Yamaha R3 and MT-03: ఈ రెండు బైక్‌లు పవర్-ఫుల్ 321సీసీ ఇంజన్, లైట్ వెయిట్ డైమండ్ ఫ్రేమ్‌తో కూడిన అధునాతన ఛాసిస్ మరియు స్టాండ్‌అవుట్ డిజైన్ ఎలిమెంట్స్ తో వస్తున్నాయి. YZR-M1 నుండి ప్రేరణ పొందిన R3, హార్డ్‌కోర్ రైడర్‌లకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది, అయితే MT-03, హైపర్-నేక్డ్ ఫ్యామిలీ నుంచి డిజైన్ చేయబడింది, బోల్డ్ లుక్ తో మంచి టార్క్ మరియు పెర్ఫార్మన్స్ ఇచ్చే వెహికల్. యమహా యువకుల కోసం మరియు భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను పెంపొందించడానికి ఈ వెహికల్స్ ని రిలీజ్ చేసినట్టు తెలుపుతుంది. R3 గతంలో 2020 వరకు భారతదేశంలో విక్రయించబడింది, కానీ BS6 నిబంధనల కారణంగా నిలిపివేయబడింది. ఇది ఇప్పుడు BS6 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్‌లతో పునఃప్రారంభించబడింది. MT-03, మరోవైపు, భారతీయ మార్కెట్లో పూర్తిగా కొత్త బైక్.

Yamaha R3:

Yamaha R3 అనేక లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఓల్డ్ మోడల్‌లో లేని LED హెడ్‌ల్యాంప్‌లు మరియు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లతో ఈ బైక్ కొత్త ఫెయిరింగ్‌తో వస్తుంది. ఇది 110-సెక్షన్ టైర్ అప్‌ఫ్రంట్ మరియు డ్యూయల్-ఛానల్ ABS తో కూడా వస్తుంది. హ్యాండిల్‌బార్లు క్లిప్-ఆన్‌లు, మరియు బైక్ ఇప్పుడు మునుపటి అనలాగ్-డిజిటల్ సెటప్ వలె కాకుండా. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది, ట్యాంక్ డిజైన్ చేంజ్ చేయబడింది, మరియు సీటు కొంతవరకు అలాగే ఉంటుంది, పిలియన్ సీటు అంట కంఫర్ట్ గ ఉండకపోవచ్చు. బైక్ వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి.

MT-03

MT-03 విషయానికి వస్తేయ్, ఇది R3 వలె అదే ఛాసిస్ మరియు ఫుట్‌పెగ్ పొజిషన్ తో వస్తుంది. ముందు భాగంలో డిఫరెంట్ ట్యాంక్ డిజైన్‌తో పాటు ఫిన్స్ కూడా వస్తాయి. హ్యాండిల్‌బార్ అప్ రైట్ పొజిషన్ లో ఉంది, సిటీ మరియు స్ట్రీట్ రైడింగ్ కోసం మరింత కంఫర్ట్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో సరికొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ అలాగే ప్రొజెక్ట్ చేయబడిన LED హెడ్‌ల్యాంప్‌లు, అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు ముందువైపు 110-సెక్షన్ టైర్లు మరియు వెనుకవైపు 140 ఉన్నాయి.

Yamaha R3 and MT-03 Power

రెండు బైక్‌లు 42 PS పవర్ మరియు 30 Nm టార్క్‌ను జెనరేట్ చేసే 321cc పార్లల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తాయి. పవర్ డెలివరీ మరియు సస్పెన్షన్ సెటప్‌ రెండు బైక్‌ల మధ్య ఒకే విధంగా ఉంటుంది. ఫెయిరింగ్ లేకపోవడం వల్ల MT-03 R3 కంటే కొంచెం తేలికగా ఉంటుంది. R3 క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లతో మరింత దూకుడుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, అయితే MT-03 మరింత సౌకర్యవంతమైన నిటారుగా రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, ఇది సిటీ రైడింగ్‌కు బాగా సరిపోతుంది.

Yamaha R3 and MT-03 Features

రెండు బైక్‌లలో ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి నిర్దిష్ట ఫీచర్లు లేవు, ఇవి MT-15 మరియు R15 వంటి చిన్న యమహా మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. రెండు బైక్‌ల ధర 4 మరియు 4.2 లక్షల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. మొత్తంమీద, రెండు బైక్‌లు మంచి హై పెర్ఫార్మన్స్ బైక్స్ గ పరిగణించబడుతున్నాయి, అయితే భారతీయ రోడ్లపై వాటి పనితీరు నిజమైన పరీక్షగా ఉంటుంది.

Yamaha R3 and MT-03 Specifications:

Feature Yamaha R3 Yamaha MT-03
Fairing Design New N/A
Headlamps LED Projected LED
Front Suspension Upside-down forks Upside-down forks
Front Tire 110-section 110-section
ABS Dual-channel N/A
Handlebars Clip-on Upright
Instrument Console Fully digital N/A
Tank Design Changed with fins Different with fins
Pillion Seat Yes, with strap N/A
Tail Lamps LED N/A
Turn Indicators LED N/A
Engine 321cc parallel-twin 321cc parallel-twin
Power 42 PS 42 PS
Torque 30 Nm 30 Nm
Riding Position Aggressive Comfortable
Vibrations Not felt up to 10,000 RPM Not felt up to 10,000 RPM
Additional Features – Fully digital instrument console – –
– LED headlamps
– Tank design with fins
– Pillion seat with strap
– LED tail lamps and turn indicators
– Clip-on handlebars
– Smooth engine
– Lack of features like traction control, slip and assist clutch, Bluetooth connectivity Lack of features like traction control, slip and assist clutch, Bluetooth connectivity
Expected Price Range Between 4 and 4.2 lakh rupees Between 4 and 4.2 lakh rupees

 

Yamaha R3 and MT-03 

Comments are closed.