అబ్బాయిలైనా, అమ్మాయిలయినా తమ జుట్టు నల్లగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు తమ జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా ఉండటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను (products) జుట్టు పెరగడం కోసం వాడుతుంటారు.
జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. కానీ వాటిలో ఉండే రసాయనాలు (Chemicals) వల్ల వాటి ఫలితం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే జుట్టు కూడా త్వరగా పాడైపోతుంది.
అలా కాకుండా మనమే సొంతంగా సహజ పద్ధతిలో హెయిర్ పౌడర్, హెయిర్ ప్యాక్ లాంటివి తయారు చేసుకుని జుట్టుకు వాడినట్లయితే దుష్ప్రభావం (side effect) లేకుండా జుట్టును ఎక్కువ కాలం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
Also Read : Aloe Vera : కలబందతో జుట్టును ధృడంగా, కాంతివంతంగా మార్చుకోండి
తల స్నానం చేయాలంటే చాలామంది షాంపూను వాడుతుంటారు షాంపులలో రసాయనాల గాఢత అధికంగా ఉండటం వలన జుట్టు త్వరగా దెబ్బతింటుంది. అలా కాకుండా ఉండాలంటే షాంపూ కు బదులుగా ఆయుర్వేద పౌడర్లతో జుట్టును కడిగినట్లయితే జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు.ఈరోజు కథనంలో ఆయుర్వేద పౌడర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఆయుర్వేద పౌడర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
శీకాకాయ, ఉసిరికాయ మరియు రీతా.
ఈ మూడింటిని విడివిడిగా పొడి లా చేయాలి. షాంపూకు బదులుగా ఈ పొడిని ఉపయోగించడం ద్వారా జుట్టుకున్న అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.
ఈ పొడిని జుట్టుకు ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం:
ఈ మూడు రకాల పొడులను సమాన పరిమాణంలో తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. తర్వాత వేడి నీళ్లు పోసి కలపాలి. చల్లగా అయ్యాక జుట్టుకి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును సాధారణ నీటితో కడగాలి. ఈ పొడి ని తలకు పెట్టిన తర్వాత కడిగేటప్పుడు నురగ (foam) వస్తుంది. శుభ్రంగా నురగ పోయే వరకు సాధారణ నీటితో కడగాలి. ఈ ఆయుర్వేద పౌడర్ ను క్రమం తప్పకుండా జుట్టుకు వాడినట్లయితే తల మూలాల పై పేరుకుని ఉన్న అదనపు జిడ్డును కూడా తొలగిస్తుంది. జుట్టులో ఉన్న మురికిని తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ పౌడర్ వాడటం వల్ల జుట్టు బలంగా మారుతుంది. జుట్టు విపరీతంగా రాలుతుంటే ఈ ఆయుర్వేద పౌడర్ ను ఉపయోగించడం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.
Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా
కొంతమందికి జుట్టు చివర చిట్లి పోయి ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నా కూడా ఈ ఆయుర్వేద పౌడర్ ను వాడటం వల్ల వెంట్రుకలు చిట్లి పోకుండా కాపాడుతుంది.
కాబట్టి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడుకున్న షాంపూలకు బదులుగా ఈ ఆయుర్వేద పౌడర్ ను ఉపయోగించి జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు.ఈ పొడిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. కాబట్టి దీనిని అందరు వాడవచ్చు.