Aloe Vera : కలబందతో జుట్టును ధృడంగా, కాంతివంతంగా మార్చుకోండి

జుట్టు సమస్యలకు చాలా మంది మార్కెట్ లో దొరికే పలు రకాల ఉత్పత్తులను వాడుతుంటారు వాటివలన డబ్బు దండుగ మరియు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి సహజంగా దొరికే కలబంద వాడి జుట్టు సమస్యలనుండి బయట పడవచ్చు.

నేటి కాలంలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు అందరూ ఉండాలని కోరుకోవడం సహజం దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో జుట్టు (hair) కోసం వాడే ఉత్పత్తులు (products) జుట్టును బలంగా చేయడానికి బదులుగా మరింత దెబ్బతినేలా (damage) చేస్తాయి.

జుట్టు మూలాల నుండి బలహీనంగా (Weakly) మారడం ప్రారంభమైనప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అటువంటిప్పుడు పోషకాహారం తీసుకోవడంతో పాటు రసాయన ఉత్పత్తులను వాడకుండా ఉండటం అవసరం .జుట్టును సహజ పద్ధతి (Natural method) లో బలంగా, ఒత్తుగా, నిగారింపుగా మార్చుకోవచ్చు. నిర్జీవంగా (lifeless) మారిన జుట్టును కాంతివంతంగా కూడా మార్చవచ్చు. మార్కెట్లో లభించే రసాయనాల (chemicals)తో కూడుకున్న ఉత్పత్తులను వాడకుండా, ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి జుట్టును బలోపేతం (strengthen) చేసుకోవచ్చు.

చాలామంది జుట్టు ఆరోగ్యం (health) కోసం కలబంద (Aloe Vera) ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించి నట్లయితే జుట్టు సమస్యలను నివారించవచ్చు.

కలబందను ఉపయోగించి జుట్టుకి ఉపయోగించే చిట్కాల గురించి తెలుసుకుందాం.

Aloe Vera : Make hair strong and shiny with aloe vera
Image Credit : IWMM Buzz

కలబంద జెల్ ను తీసుకోవాలి. ఒక గిన్నెలో ఐదు స్పూన్ల- కొబ్బరి నూనె (coconut oil), మరియు మూడు స్పూన్ల -కలబంద జెల్ వేసి కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తలకు మూలాల (of sources) నుండి చివరి వరకు అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా జుట్టుకు ప్రయోజనం కలుగుతుంది.

Also Read : Hair Grow Faster : “బయోటిన్ పౌడర్” మీ జుట్టును మందంగా పెంచుతుంది, చర్మానికి అందాన్ని ఇస్తుంది, వాడి చూడండి తేడా తెలుసుకోండి

ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకోవాలి. ఉల్లిపాయను కట్ చేసి రసం (onion juice) తీయాలి. ఈ రసాన్ని అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. కొన్ని రోజుల్లోనే తేడా గమనిస్తారు.

Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

కలబంద జెల్ (Aloe vera gel)- ఐదు స్పూన్లు మరియు పెరుగు (curd)-ఐదు స్పూన్లు, కొబ్బరి పాలు (Coconut milk)-రెండు స్పూన్లు, బాదం నూనె (Almond oil) కొద్దిగా వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు మూలాల నుండి చివరి వరకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. తరచుగా ఈ విధంగా చేయడం వలన కొన్ని రోజుల్లోనే మార్పు ను మీరే గమనిస్తారు‌. ఇది చుండ్రు (dandruff) సమస్యను తొలగిస్తుంది. జుట్టు రాలే (Hair loss) సమస్యను నివారిస్తుంది. నిర్జీవంగా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాబట్టి కలబంద జెల్ ను ఈ విధంగా ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు

Comments are closed.