నిమ్మకాయతో వంటకు రుచి మాత్రమే కాదు, మీ కిచెన్ తళతళా మెరిసేలా చేసేయొచ్చు

Telugu Mirror : మన ఇంట్లో నిమ్మకాయ వాడకం అధికంగా ఉంటుంది. ఇక నాన్-వెజ్ ఇంట్లో వండుకున్నాం అంటే కచ్చితంగా నిమ్మకాయ (Lemon) ఉండాల్సిందే. నిమ్మకాయ ఆహారం లో మాత్రమే కాదు మరెన్నో  పనులకు కూడా ఉపయోగిస్తారు. నిమ్మకాయ వల్ల ఆరోగ్యమే కాదు వంట గది (Kitchen) శుభ్రం చేయడానికి కూడా వినియోగిస్తారు. నిమ్మకాయ ని క్లీనింగ్ కోసం వాడితే మీ వంట గది క్లీన్ గా ఉంటుంది. నిమ్మకాయ రసం ని ఉపయోగించడం వలన దుర్వాసన మాయమవుతుంది మరియు ఏమైనా మొండి మరకలు ఉంటె పూర్తిగా పోతాయి. ఇంకా వంటింట్లో ఉండే భాగాలను మెరిసే లా చేస్తుంది. నిమ్మకాయని ఉపయోగించడం వలన ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతారు. నిమ్మరసం క్రిమిసంహారక మరియు వంట పాత్రలను  క్లీన్ చేయడానికి సహాయపడుతుంది.అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1. నిమ్మకాయతో  స్టీల్ పాత్రలు శుభ్రం చేయడం
మనం స్టెయిన్‌లెస్ (Stainless) స్టీల్ ను తరచుగా ఉపయోగించడం వల్ల వంటసామాను చూడడానికి అంత మంచిగా అనిపించదు. శుభ్రపరిచేటప్పుడు మీ స్టెయిన్‌లెస్ స్టీల్  సామానుకు కొన్ని చుక్కల నిమ్మరసం జోడించడం వల్ల దాని రూపం కొత్తదాని వలె మెరుస్తుంది. నిమ్మరసంతో మీ కిచెన్ లో ఉండే సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.

2. నిమ్మకాయతో  చాపింగ్ బోర్డ్ శుభ్రం చేయడం

నిమ్మరసం కటింగ్ బోర్డుల నుండి కఠినమైన (Tough) మరకలు మరియు దుర్వాసనాలను తొలగిస్తుంది. నిమ్మకాయ ముక్కలు చేసి దాని రసాన్ని బోర్డు మీద పిండాలి. అక్కడి ప్రాంతాన్ని నిమ్మరసం వేసి కొన్ని నిమిషాలు నాననివ్వండి. లెమన్, యాసిడ్ మరకలు మరియు దుర్వాసనను తొలగిస్తుంది. కడిగిన తరువాత, కట్టింగ్ బోర్డ్‌ను ఆరబెట్టండి. ఈ కట్టింగ్ బోర్డ్ శుభ్రంగా మరియు చూడడానికి నీట్ గా కనిపిస్తుంది.

lemon-not-only-adds-flavor-to-cooking-it-can-also-make-your-kitchen-sparkle
Image Credit:Hindustan Times

3. నిమ్మకాయతో స్టవ్ టాప్స్ శుభ్రం చేయడం

1. నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసాన్ని స్పాంజిపై పిండండి.
2. జిడ్డుగల స్టవ్‌టాప్‌లను (Stovetops) సున్నితంగా రుద్దండి.
3. నిమ్మరసం నూనెను తగ్గిస్తుంది, తుడవడం సులభం చేస్తుంది. మొండి మరియు  జిడ్డు (oily) నూనె మరకలు ఉంటే, ముందు నిమ్మరసం వేసి కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్ (Scrub) చేస్తే జిడ్డు పోయి స్టవ్ మెరుస్తుంది.

4. నిమ్మకాయతో కత్తులు (Knifes) శుభ్రం చేయండి

నిమ్మకాయలో ఉండే ఆమ్లం తుప్పును (Rust) సులువుగా తొలగిస్తుంది. కత్తులు మరియు వంటసామాను మెరిసేలా చేస్తుంది. నిమ్మకాయలోని యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలు బ్లేడ్‌లను శుభ్రపరచి కొత్త దాని వలె మెరిసేలా చేస్తాయి. నిమ్మకాయ ముక్క మరియు ఉప్పుతో బ్లేడ్‌ల నుండి తుప్పు మరియు ధూళిని తొలగిస్తుంది

5. నిమ్మకాయతో వంటగదిలో ఉండే టైల్స్ శుభ్రం చేయండి

బోరాక్స్ పౌడర్ (Borax powder) మరియు నిమ్మరసం ఒక ఇసుకతో కూడిన పేస్ట్‌ను తయారు చేయండి. ఇది గోడలను మరియు వంటగది టైల్స్ ను  శుభ్రపరుస్తుంది. ఈ పేస్ట్ వంటగది టైల్స్ ని మరియు కఠినమైన మరకలను పూర్తిగా తొలగిస్తుంది. బోరాక్స్ పౌడర్ మరియు నిమ్మరసం యొక్క పేస్ట్ తయారు చేసి  మీ వంటగదిని మొత్తం శుభ్రపరచండి

Comments are closed.