Telugu Mirror: మీరు కోటీశ్వరులు కావాలా? కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1నుండి ఇన్ వాయిస్ ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. ఈ స్కీమ్ ని ఉపయోగించి మీరు కోటీశ్వరులు కావొచ్చు. వస్తువులను కొనుగోలు చేసినప్పుడు తప్పని సరిగా బిల్లు అడిగి తీసుకోవటానికి కస్టమర్ లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ స్కీమ్ మీరు కోటీశ్వరులు అవడానికి ఉపయోగించు కోవచ్చు. నరేంద్ర మోడీ-ప్రభుత్వం యొక్క ‘మేరా బిల్ మేరా అధికార్’ (Mera Bill Mera Adhikar) ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకం మీరు కోటీశ్వరులు కావడానికి సహాయపడుతుంది.
సెప్టెంబర్ 1న ఆరు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో ప్రారంభమయ్యే ‘మేరా బిల్ మేరా అధికార్’ ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. మేరా బిల్ మేరా అధికార్ ఇన్‌వాయిస్ ఇన్‌సెంటివ్ స్కీమ్ GST ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా వినియోగదారులు రూ.10,000 నుండి రూ.కోటి వరకు నగదు బహుమతులు పొందడానికి అనుమతిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సంస్థ(CBIC )తెలిపింది. ‘మేరా బిల్ మేరా అధికార్’ ఇన్ వాయిస్ ఇన్సెంటివ్ పథకం (invoice invest scheme) GST ఇన్వాయిస్ లను అప్ లోడ్ చేయడం పై నగదు బహుమతులను అందిస్తుందని CBIC ‘X’ లో ట్వీట్ చేసింది. మేరా బిల్ మేరా అధికార్ మొబైల్ యాప్ IOS మరియు Android ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుందని PTI ఒక నివేదికలో వెల్లడించింది.
‘మేరా బిల్ మేరా అధికార్’ (Mera Bill Mera Adhikar) ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకం గురించి మీరు తెలుసుకోవలసిన సమాచారం ఇక్కడ అందిస్తున్నాము.
1) మేరా బిల్ మేరా అధికార్ ప్రోత్సాహక పథకం ₹ 10,000 నుండి ₹ 1 కోటి వరకు నగదు బహుమతులను కలిగి ఉంది.
2) ఈ పథకం 6 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభమవుతుంది. ఈ పథకం అస్సాం, గుజరాత్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ప్రారంభించబడుతుంది; అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, డామన్ & డయ్యూ మరియు దాద్రా & నగర్ హవేలీ లో అమలవుతుంది.
3) కోనుగోలు చేసినవారికి వస్తువులు మరియు సేవల పన్ను (GST) నమోదిత సరఫరాదారులు జారీ చేసిన అన్ని ఇన్‌వాయిస్‌లు ‘మేరా బిల్ మేరా అధికార్’ పథకానికి అర్హత కలిగి ఉంటాయి.
4) ఈ పథకం క్రింద నెలవారీ మరియు త్రైమాసికం లో డ్రాలు వేయబడతాయి మరియు విజేతలకు రూ. 10,000 నుండి రూ. 1 కోటి వరకు నగదు బహుమతి, బహుమతులకు అర్హులు.
5) PTI నివేదిక ప్రకారం, లక్కీ డ్రా కోసం అర్హత కలిగి ఉండాలంటే మీరు కొన్న వస్తువు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. అలాగే సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ స్కీమ్ లో ఒక నెలలో ఎవరైనా అత్యధికంగా 25 ఇన్‌వాయిస్‌లను (బిల్లులను) అప్‌లోడ్ చేయవచ్చు.
వ్యాపారం లో కొనే వారు అమ్మే వారి నుండి ప్రతి కొనుగోలుకు నిజమైన బిల్లు అడిగి తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకం రూపకల్పన చేసింది నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని భారత కేంద్ర ప్రభుత్వం.