SBI Jobs: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్, ఎస్బీఐలో 12 వేల ఉద్యోగాలు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని ఎస్బీఐ తెలిపింది.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తీపి కబురు అందించింది. ఐటీ సెక్టార్‌ (IT Sector) లో రిక్రూట్‌మెంట్ తగ్గిపోతున్న తరుణంలో, ఇటీవలి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల (Engineering Graduates) కోసం SBI మంచి శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కొత్తగా 12 వేల మందిని నియమించుకోనున్నట్లు పేర్కొంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల (Engineering Graduates) లో 85 శాతం మందికి అవకాశాలు కల్పిస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖర్రా తెలిపారు. 3,000 మంది ప్రాజెక్ట్ అధికారులు మరియు 8,000 మంది అసోసియేట్‌లకు బ్యాంకింగ్ కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వబడుతుంది మరియు వివిధ వ్యాపార విభాగాలకు వాళ్ళను కేటాయిస్తాం అని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖర్రా తెలిపారు

దినేష్ ఖర్రా ప్రకారం, బ్యాంకింగ్ రంగం ఇటీవలి సంవత్సరాలలో సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతోంది. టెక్నాలజీని ఉపయోగించి ఖాతాదారులకు కొత్త మార్గంలో ఎలా సేవలందించాలనే దానిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై కొన్ని బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్న సంగతి గుర్తు చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులకు వారి అర్హతలు మరియు ప్రతిభ ఆధారంగా వివిధ రకాల వ్యాపార మరియు IT పాత్రలు కేటాయించబడతాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడే బ్యాంకింగ్ రంగానికి తగిన సాంకేతిక సిబ్బందిని అందించగలుగుతామని ఆయన పేర్కొన్నారు.

SBI bank UPI, Net Banking, Yono services will be interrupted

ఎస్బీఐ సిబ్బంది ఇన్‌హౌస్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నాలజీ పై శిక్షణ ఇవ్వడానికి భారీ మొత్తంలోనే ఖర్చవుతున్నదని దినేశ్ ఖర్రా చెప్పారు. ప్రతి ఉద్యోగీ టెక్నాలజీ (Technology) ని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు అత్యధికంగా టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ (Banking) లావాదేవీలు జరుగుతున్న సంగతిని ఎవరూ కాదనలేరు. ఈ విషయమై బ్యాంకింగ్ (Banking) నియంత్రణ సంస్థ ‘ఆర్బీఐ’ కూడా తగిన మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు.

2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,296గా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,35,858గా ఉండగా, తాజాగా కాస్త తగ్గింది. దీంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంకు భావిస్తోంది.

Comments are closed.