Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

ప్రస్తుత కాలంలో విపరీతమైన కాలుష్యం అలాగే జీవనశైలిలో మార్పుల వలన ప్రతి ఒక్కరిలో కేశ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి వాటినుంచి రిలీఫ్ పొందటానికి తులసి ఆకుల తో హెయిర్ ప్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది .

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ప్రతి ఒక్కరూ తమ జుట్టు (Hair) దృఢంగా, ఒత్తుగా ఉండాలని కోరుకోవడం సహజం. కానీ కాలుష్యంతో (Pollution) కూడిన వాతావరణ పరిస్థితులు మరియు జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుంది.

ప్రతి ఇద్దరి వ్యక్తులలో ఒకరికి ఖచ్చితంగా ఈ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనితో పాటు చుండ్రు (Dandruff) సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి కొంతమంది పార్లర్ (Parlour) కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే అందరికీ ఆ అవకాశం ఉండదు కదా. అటువంటి వారి కోసం ఇంట్లోనే తయారు చేసుకుని వాడే కొన్ని ఇంటి చిట్కాలను (Home remedies) తెలియజేస్తున్నాం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు చుండ్రు సమస్యను కూడా నివారిస్తాయి.

Basil Benefits: Check hair problems with basil
image credit : Nature & Nurture Seeds

ఈరోజు కథనంలో తులసి (Tulasi) ఆకులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు మరియు చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులలో సహజంగానే ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాలను నివారించే లక్షణం జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది.

Also Read : కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం, డబ్బు మితం పోషణ అమితం.

Reasons For White Hair : తెల్లజుట్టు వచ్చే ప్రమాదం నుండి కాపాడుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు పాటించి చూడండి.

తులసి ఆకులను ఉపయోగించి తయారు చేసే హెయిర్ ప్యాక్ (Hair pack) ల గురించి తెలుసుకుందాం :

తులసి మరియు తేనె:

తులసి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పేస్ట్ లా చేయాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ తేనె (Honey) కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టులో మెరుపు వస్తుంది.

Basil Benefits: Check hair problems with basil
image credit : Amazon.in

తులసి మరియు కొబ్బరిపాలు :

తులసి మరియు కొబ్బరి పాలు (Coconut milk) రెండు కూడా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి పేస్టులా చేయాలి. ఈ పేస్ట్ (Paste) ని కొబ్బరి పాలలో కలపాలి. తర్వాత దీన్ని స్టవ్ (Stove) పైన పెట్టి సన్నని మంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా అయ్యాక జుట్టుకి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టుని కడగాలి ఈ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మరియు మృదువుగా మారుతుంది.

Basil Benefits: Check hair problems with basil
image credit : Lok mat

తులసి మరియు కొబ్బరినూనె :

ఈ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా తులసి ఆకులను కడిగి తడిపోయే వరకు ఆరనివ్వాలి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె (Coconut oil)తీసుకోవాలి. దీనిలో ఆరిన తులసి ఆకులు మరియు ఉసిరికాయ పొడి (Amla powder) వేసి కలపాలి. ఈ గిన్నె ను స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద ఐదు నిమిషాలు మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక ఈ ఆయిల్ ను తలకు రాసి మసాజ్ చేయాలి‌. ఈ విధంగా తరచుగా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. దీనితో పాటు చుండ్రు సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
కాబట్టి పార్లర్ కు వెళ్లలేని వారు ఇంటి దగ్గరే ఇటువంటి హెయిర్ ప్యాక్ (Hair pack) లను తయారు చేసుకొని వాడటం వల్ల పార్లర్ లో పొందే ఫలితాలను ఇంట్లో కూడా పొందవచ్చు.

Comments are closed.