జుట్టు నల్లగా దృఢంగా మరియు షైనీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సర్వసాధారణం. ప్రస్తుత రోజుల్లో అందరిని బాధించే సమస్యలలో జుట్టు రాలిపోవడం (Hair loss) ఒకటి.
ఎంత అందంగా ఉన్నవారికైనా జుట్టు మంచిగా ఉంటేనే వారి అందం రెట్టింపు అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
జుట్టు రాలడానికి వివిధ రకాల కారణాలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, పోషకాహార లోపం అలాగే మారిన జీవన విధానం (life style). వీటి వల్ల జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.
అయితే జుట్టుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ మొక్క ఆకుల యొక్క నూనెను వాడినట్లయితే జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.
రోజ్ మేరీ ఆయిల్ యొక్క ఉపయోగాలు మరియు జుట్టుకి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
రోజ్ మేరీ మొక్క (Rose Mary plant) లో అధిక పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ మధ్యకాలంలో ఈ ఆయిల్ బాగా ప్రాచుర్యం (popularity) పొందింది.
ఈ ఆయిల్ లో కార్నోసిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది.ఇది చనిపోయిన కణాల (Dead cells) ను మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుంది.
ఈ ఆయిల్ కేవలం జుట్టు కే కాదు చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో రోజ్ మేరీ ఆయిల్ ను వివిధ రకాల సమస్యలకు ఔషధం (medicine) గా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ జుట్టును బలంగా, దృఢంగా ఉంచడంలో చాలా బాగా తోడ్పడుతుంది.
ఈ ఆయిల్ మార్కెట్లో సులభంగా లభిస్తుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనె (coconut oil) లో, ఐదు నుంచి ఆరు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ ను వేసి బాగా కలపాలి. దీనిని డబుల్ బాయిల్ మెథడ్ లో వేడి చేయాలి. నేరుగా వేడి చేయకూడదు.
Also Read : Skin Problems In Winter : చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎదుర్కోండి
ఇలా వేడెక్కిన ఆయిల్ ను గోరువెచ్చగా అయ్యాక, ఈ నూనెలో కాటన్ ముంచి జుట్టుకు మూలాల నుండి చివరి వరకు అప్లై చేయాలి. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సున్నితంగా తలను మర్దనా చేసి గంట తర్వాత ఏదైనా మైల్డ్ షాంపు తో తల స్నానం చేయాలి.
ఈ ఆయిల్ యొక్క ఉపయోగాలు :
రోజ్ మేరీ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్యను మరియు చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడటం వంటి సమస్యలను నివారిస్తుంది. చుండ్రు, దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఈ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడినట్లయితే కొద్ది రోజుల్లోనే జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా, దృఢంగా మారుతుంది.
రోజ్ మేరీ మొక్క యొక్క ఆకులను స్ప్రే రూపంలో కూడా ఉపయోగించవచ్చు.
ఒక గ్లాస్ నీటిలో రోజ్ మేరీ ఆకులు, పుదీనా ఆకుల (Mint leaves) ను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టుకు స్ప్రే చేయాలి. ఇలా చేసినా కూడా జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
ఎటువంటి జుట్టు సమస్యలు ఉన్నా సరే రోజ్ మేరీ ఆయిల్ లేదా స్ప్రే వాడటం వలన కొద్ది రోజుల్లోనే జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు.