Beauty Tips: ‘మ్యాజికల్ హెయిర్ మాస్క్’ ఇప్పుడు మీ జుట్టును ధృడంగా, సిల్కీగా చేస్తుంది. ఇప్పుడు ఖర్చు లేకుండా ఇంటివద్దే..

జుట్టు నల్లగా, దృఢంగా, సిల్కీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి.జుట్టు బలంగా, సిల్కీ గా ఉండాలంటే ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడినట్లయితే పార్లర్ లో వేల రూపాయల ఖరీదు చేసే ట్రీట్మెంట్ వల్ల వచ్చే సిల్కీ హెయిర్ ను అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పొందవచ్చు.

జుట్టు నల్లగా, దృఢంగా, సిల్కీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యలలో జుట్టు సమస్య (Hair Problem) ఒకటి.

స్త్రీలకు కాని, పురుషుల కానీ జుట్టు అందంగా ఉండటం వల్ల వారి అందం మరింత పెరుగుతుంది. ఎండ వల్ల, వాతావరణంలో ఉండే కాలుష్యం మరియు మారిన జీవనశైలి (Life style) ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంటుంది.

చాలామంది కేశాలంకరణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి వీటివల్ల జుట్టు మరింత డ్రైగా మరియు బలహీనంగా అవుతూ ఉంటుంది. కొంతమంది జుట్టు డ్రైగా, నిర్జీవంగా ఉన్నవారు పార్లర్ కి వెళ్లి కెరాటిన్ చికిత్స (treatment) చేయిస్తారు. దీని కోసం వేలల్లో ఖర్చు చేస్తారు.

జుట్టు బలంగా, సిల్కీ గా ఉండాలంటే ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడినట్లయితే పార్లర్ లో వేల రూపాయల ఖరీదు చేసే ట్రీట్మెంట్ వల్ల వచ్చే సిల్కీ హెయిర్ ను అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పొందవచ్చు. ఈ హెయిర్ మాస్క్ తయారీ కి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు.

Also Read : Hair Growth : పూర్తి సహజ పద్దతులలో కేశ సంరక్షణకు ఇలా చేయండి.

ఈరోజు కథనంలో డబ్బులు వృధా అవ్వకుండా అద్భుతమైన మ్యాజికల్ హెయిర్ మాస్క్  ను  తెలియజేస్తున్నాం. దీనిని వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

సిల్కీ మరియు పట్టుకుచ్చు లాంటి జుట్టు ను పొందడం  కోసం ఇంట్లోనే హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

హెయిర్ మాస్క్ కి కావలసిన పదార్థాలు:

Beauty Tips: 'Magical Hair Mask' now makes your hair strong and silky. Now at home without cost..
Image Credit : TNB Vietnam

తాజా కలబంద గుజ్జు- రెండు టేబుల్ స్పూన్లు, ఎగ్స్- రెండు, విటమిన్- ఇ క్యాప్సిల్ -రెండు.

కలబంద గుజ్జును మిక్సీ పట్టాలి. తర్వాత దీనిలో ఎగ్స్ పగలగొట్టి వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో విటమిన్ – E క్యాప్సిల్ ని వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలలో మాస్క్ సిద్దమయింది .ఈ మిశ్రమాన్ని తలకు మూలాల నుండి చివరి వరకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

కాటన్ టవల్ తో జుట్టును తుడవాలి. ఆ తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఏదైనా సీరం ను అప్లై చేయాలి. సీరం అప్లై చేసిన తర్వాత జుట్టు చాలా అందంగా, మెరుస్తూ, సిల్కీ గా మారుతుంది.

ఈ ప్యాక్ ను వాడటం వల్ల జుట్టుకి ప్రభావంతంగా పనిచేయడానికి గల కారణాలు తెలుసుకుందాం.

ఈ ప్యాక్ లో గుడ్లు (Eggs) ఉపయోగించాం. ఎగ్ లో ప్రోటీన్ మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుడ్డులో ఉన్న పసుపు సొన, పొడిబారిన జుట్టుకు పోషణ ను అందిస్తుంది. జుట్టు మెరిసేలా చేసి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

కలబంద గుజ్జు(Aloevera pulp) లో విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి నిర్జీవంగా మరియు పొడిగా ఉన్న జుట్టుకు తేమను అందించి జుట్టు మెరిసేలా చేయడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

విటమిన్- E క్యాప్సిల్ జుట్టును బలంగా చేయడంతో పాటు ఒత్తుగా, మృదువుగా చేస్తుంది. అలాగే చుండ్రు ను కూడా తొలగించి జుట్టును మరింత ఆరోగ్యంగా (Healthy) ఉండేలా చేస్తుంది.

Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

White Hair : తెల్ల జుట్టు సమస్య తో బాధపడుతున్నారా ?నల్లని,దట్టమైన కేశాలకు బలం చేకూరాలంటే ఈ నాచురల్ టిప్స్ పాటించాల్సిందే..

కనుక ఈ మూడు వస్తువులు జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో చాలా ప్రభావంతంగా (Effectively) పనిచేస్తాయి. పార్లర్ లో చేసే కెరాటిన్ చికిత్స వల్ల జుట్టుకి ఎటువంటి మెరుపు వస్తుందో, అదే మెరుపు ఈ మ్యాజికల్ హెయిర్ మాస్క్ వల్ల వస్తుంది.

కాబట్టి జుట్టు డ్రై గా ఉన్నవారు తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేసుకొని ఉపయోగించండి. మెరిసే జుట్టు (shiny hair) ను సొంతం చేసుకోండి.

Comments are closed.