Benefits OF Coriander Leaves : జుట్టు రాలడాన్ని, బట్టతలను అరికట్టే కొత్తిమీర

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. మరికొందరు బట్టతల తో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కొత్తిమీరను వాడడం వల్ల 30 రోజుల్లోనే బట్ట తలపై కూడా జుట్టు వస్తుందని మరియు జుట్టు రాలడం కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడించారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. కాలుష్యం (Pollution) తో కూడిన వాతావరణం, పోషకాహార లోపం మరియు మారిన జీవన విధానం. ఈ కారణాల చేత జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీంతో చాలామంది మానసికంగా ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ప్రతిరోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.

అంతకుమించి రాలినట్లయితే జుట్టు రాలుతుందని అర్థం. దీంతో కొందరు మార్కెట్లో లభించే వివిధ రకాల హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటి వల్ల కూడా ఫలితం ఉండదు. కొన్ని సందర్భాలలో వీటిలో ఉండే రసాయనాల (Chemicals) వల్ల జుట్టు ఇంకా అధికంగా రాలుతూ ఉంటుంది. మరికొందరు బట్టతల (baldness) తో బాధపడుతూ ఉంటారు.

ఇటువంటి సమస్య వచ్చినప్పుడు బయటపడటానికి కొత్తిమీర (Coriander) చాలా బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొత్తిమీరను వాడడం వల్ల 30 రోజుల్లోనే బట్ట తలపై కూడా జుట్టు వస్తుందని మరియు జుట్టు రాలడం కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడించారు.

కొత్తిమీరను ఉపయోగించి ఏ విధంగా జుట్టు రాలే సమస్య మరియు బట్టతల సమస్యల నుండి బయటపడవచ్చో తెలుసుకుందాం.

Benefits of Coriander Leaves : Coriander prevents hair fall and baldness
image credit : iStock

కొత్తిమీర ఆయిల్ :

కొత్తిమీర నూనె తయారు చేయడానికి కొత్తిమీర, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ కావాలి. ముందుగా కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వడకట్టి రసం తీయాలి. ఈ రసంలో కొబ్బరి నూనె మరియు ఆలివ్ ఆయిల్ సమపాళ్లల్లో వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్ళు నుంచి చివర వరకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా నెల రోజులు కొత్తిమీర నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

కొత్తిమీర విత్తనాలు :

మూడు స్పూన్ల కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) తీసుకొని మిక్సీ పట్టి పొడి లా చేయాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుంటూ ఉంటే రాలిన చోట తిరిగి కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

కొత్తిమీర వాటర్ :

ఒక మందపాటి పాత్ర తీసుకొని అందులో కొత్తిమీర మరియు తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టుకోవాలి. ఈ నీళ్లు బాగా చల్లారాక జుట్టు కుదుళ్ల నుంచి చివరిదాకా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు మర్దన (massage) చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

జుట్టు బలంగా, ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగాలంటే పురాతన పద్దతులలో ఉన్న ఈ చిట్కాలను పాటించండి

కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు మరియు బట్టతల సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలను పాటించడం ద్వారా బట్టతల మరియు జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.

గమనిక :

ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. వీటిని పాటించే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించండి.

Comments are closed.