గడ్డం పెరగలేదని గాబరా పడకండి ఇలా చేసి ట్రెండీ గా మారండి

ప్రస్తుతం గడ్డం పెంచుకోవడం ట్రెండ్ గా మారింది. అయితే కొంతమందికి గడ్డం పెంచుకోవాలని ఉన్న సరిగా గడ్డం పెరగక ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను అందిస్తున్నాం.

ప్రస్తుత రోజుల్లో గడ్డం (Beard) పెంచుకోవడం ట్రెండ్  (Trend) గా మారింది. అమ్మాయిలు కూడా గడ్డం ఉన్న అబ్బాయిలనే ఎక్కువ గా ఇష్టపడుతున్నారు. అయితే గడ్డం మందంగా మరియు మీసాలు కలిగి ఉండడానికి అబ్బాయిలు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొంతమంది అబ్బాయిలకు గడ్డం సరిగ్గా పెరగదు.

అటువంటి సందర్భంలో వారు మార్కెట్లో లభించే నూనెలను (oils) కొని గడ్డం పెరగడానికి వాటిని ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో కొన్న నూనెలలో అనేక రకాల రసాయనాలు ఉన్నట్లు కనుగొన్నారు. వాటిని వాడటం వల్ల కొన్నిసార్లు ప్రతికూల ( Negative ) ప్రభావం చూపిస్తాయి. మార్కెట్లో కొన్న నూనెలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కాబట్టి ఈరోజు కథనంలో గడ్డం పెరగడానికి కొన్ని గృహోపకరణాల ( Household appliances ) గురించి తెలియజేస్తున్నాం.

ఈ వస్తువులను ఉపయోగించడానికి ఎక్కువ డబ్బు (Money) కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో చెప్తున్నాం. వీటిని ఉపయోగించిన తర్వాత మీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది.

Don't worry about growing a beard and become trendy by doing this
Image credit : The Beard Struggle

బాదం నూనె ( Almond oil ) :

ఎవరికైనా గడ్డం సరిగా పెరగకపోయిన  లేదా పల్చగా ఉన్నా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను గడ్డం మీద రాసిన తర్వాత మృదువుగా మర్దన చేయాలి. బాదం నూనెలో విటమిన్ -ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది గడ్డం పెరగడానికి చాలా బాగా దోహదపడుతుంది.

టి ట్రీ  ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్ (టి ట్రీ ఆయిల్ ) లో కొద్దిగా ఆముదం ( castor oil ) కలపాలి. తర్వాత గడ్డం మీద అప్లై చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

Also Read : హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేపించుకోవాలని అనుకుంటున్నారా, పూర్తి అవగాహన తెచ్చుకోండిలా

Bye Bye Hair Dye : హెయిర్ డై కి టాటా చెప్పండి, సహజ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లబరచండి

ఫేస్ ప్యాక్:

గడ్డం మీద ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేకపోతే ఈ ఫేస్ ప్యాక్ (Face pack) ని వాడండి. ఉసిరికాయ (Goose Berry) ముక్కలు మరియు ఆవాల (Mustard) ను కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి.ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ను తరచుగా వాడటం వల్ల గడ్డం మందంగా మారుతుంది.

గడ్డం బాగా పెరగాలంటే దానిని ఎప్పటికప్పుడు కత్తిరించడం చాలా అవసరం. గడ్డం ఆకారాన్ని సరిచేయడం లో ట్రిమ్మింగ్ (Trimming) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా కూడా కనిపిస్తుంది.

బయోటిన్ (Biotin) సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల గడ్డంతో పాటు, జుట్టు కూడా పెరుగుతుంది. వీటిని వాడాలి అనుకుంటే వైద్యుడి (Doctor) ని సంప్రదించి, వారి సలహా తీసుకోవాలి.

కాబట్టి గడ్డం పల్చగా ఉన్నవారు ఇటువంటి కొన్ని ఇంటి చిట్కాలను (Home Remedies) పాటించి మీకున్న సమస్య నుండి బయటపడండి.

Comments are closed.