JADE ROLLER MASSAGER : మిడిల్ ఏజ్ లో కూడా టీనేజ్ లా మెరవాలంటే. ఉపయోగించండి, తేడా గమనించండి

జేడ్ రోలర్ మసాజర్. ఇది చర్మ సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఉన్న ముడతలను, సాగిపోయిన చర్మం ను బిగుతుగా చేస్తుంది.కళ్ళ కింద నల్లటి వలయాలను, డబుల్ చిన్ ను, ముఖంపై వచ్చే వాపును తగ్గిస్తుంది. ఇలా ముఖంపై వచ్చే అనేకచర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మెరిసే చర్మం పొందడం కష్టతరమవుతుంది. ఎందుకనగా పని ఒత్తిడి, నిద్రలేమి (Insomnia), అధికంగా స్క్రీన్లు వాడకం ,కాలుష్యంతో కూడిన వాతావరణం, జీవన శైలి సక్రమంగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల చాలామంది ప్రజలు చిన్న వయసులోనే పెద్దవారి లా కనిపిస్తున్నారు.

ముఖంపై వచ్చే చర్మ సమస్యలకు మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని అధికంగా వినియోగించడం వల్ల ఇతర సమస్యలు వస్తున్నాయి.

అటువంటి సందర్భంలో చాలామంది వాటికి బదులుగా, ఇటువంటి ఉత్పత్తులను వాడుతున్నారు. చాలామంది ఈ వస్తువులు వాడుతున్నారు. దీని పేరు జేడ్ రోలర్ మసాజర్ (Jade Roller Massager). ఇది చర్మ సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఉన్న ముడతలను, సాగిపోయిన చర్మం ను బిగుతుగా చేస్తుంది.కళ్ళ కింద నల్లటి వలయాలను, డబుల్ చిన్ ను, ముఖంపై వచ్చే వాపును తగ్గిస్తుంది. ఇలా ముఖంపై వచ్చే అనేకచర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

అయితే దీనిని ఉపయోగించాలి అనుకునే వారు ముందుగా దీనిని ఎలా వాడాలో తెలుసుకోవాలి.

Also Read : Tips for glowing Skin : నాచురల్ చిట్కాలతో సహజసిద్ధముగా మెరిసే చర్మం మీ సొంతం..

జేడ్ రోలర్ అంటే ఏమిటో తెలుసుకుందాం :

JADE ROLLER MASSAGER : To shine like a teenager even in middle age. Use it and notice the difference
Image credit : Flipkart

దీనిని ముఖం మరియు మెడ మసాజ్ చేయడం కోసం వాడతారు. మరియు కాళ్లు, చేతులను కూడా మసాజ్ చేసుకోవచ్చు. దీనిని జేడ్ అనే అలంకారమైన ఖనిజం (mineral) తో తయారుచేస్తారు. ఇది 17వ శతాబ్దం నుండి వాడుకలో ఉంది. అందాన్ని మెరుగు పరచడంతో పాటు మెయింటైన్ (Maintain) చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

జేడ్ రోలర్ ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి :

ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ముఖం శుభ్రంగా లేకపోతే ఇతర సమస్యలను కలిగిస్తుంది. దీనిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా లేకపోతే దాని మీద ఉన్న క్రిములు (Germs) ఇతర చర్మ సమస్యలను వచ్చేలా చేస్తాయి.

Also Read : Face Pack : మెరిసే చర్మం కోసం నాచురల్ పేస్ ప్యాక్ ..ఇప్పుడు మీ కోసం..

ముఖం మరియు మెడపై ఏదైనా గాయం ఉంటే అక్కడ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను పెంచే అవకాశం ఉంది. దీనిని ముఖం మరియు మెడపై ఉపయోగించినప్పుడు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. తక్కువ ప్రెజర్ తో ఉపయోగించాలి. చేతులు మరియు కాళ్లకు వాడినట్లు ముఖం మరియు మెడ పై గట్టిగా ప్రెజర్ ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ముఖం మరియు మెడ సున్నితం (sensitivity) గా ఉంటాయి కాబట్టి.

జేడ్ రోలర్ లో ఏమైనా పగుళ్లు (cracks) కనిపిస్తే దానిని వాడకూడదు. ఇది మీ చర్మానికి హాని కలిగిస్తుంది.

కాబట్టి దీనిని ఉపయోగించే ముందు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఉపయోగించినట్లయితే చర్మం పై వచ్చే ముడతలను, వాపును మరియు ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

Comments are closed.