ఆరోగ్య ప్రదాయిని తేనెలో కల్తీని కనుగొనండి ఇలా

తేనె ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్నది. ఆరోగ్య రక్షణిగా, రోగనిరోధక శక్తికి మరియు అందానికి కూడా తేనెను ఉపయోగిస్తారు అయితే ఇప్పటి కాలంలో సహజంగా లభించే తేనె తగ్గిపోయి తయారు చేసిన తేనెను మార్కెట్ లో అమ్ముతున్నారు. మనం కొనే తేనె స్వచ్ఛమైనదా లేక కల్తీనా తెలుసుకోవాలంటే ఇలా చేసి చూడండి.

ప్రకృతి (Nature) మనకు ప్రసాదించిన వాటిలో తేనెను ఒకటిగా చెప్పవచ్చు. తేనెటీగలు (Honey bee) రకరకాల పూల మకరందాలను సేకరించి స్వచ్ఛమైన తేనె (Pure Honey) ను మనకు అందిస్తున్నాయి. దాదాపుగా 50వేల సంవత్సరాలు ముందు నుండి తేనెను వినియోగిస్తున్నారని ఒక అంచనా. స్వచ్ఛమైన తేనెను తరచుగా తీసుకోవడం వల్ల సుమారుగా 100 రకాల రోగాలను అరికడుతుంది. తేనెలో చాలా రకాలు ఉన్నప్పటికీ అడవితేనే స్వచ్ఛమైనది.

తేనె బలవర్ధకమైన ఆహారం మరియు రోగనిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది. శరీరంలో ఉన్న సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. తేనెను తరచుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ (Cholesterol) ను అదుపులో ఉంచుతుంది. తేనె (Honey) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు తేనె ఒక చక్కటి పరిష్కార మార్గం.

అయితే మార్కెట్లో దాదాపుగా అన్ని రకాల పదార్థాలపై కల్తీ (Adulteration) విపరీతంగా జరుగుతుంది. మార్కెట్ (Market) నుంచి కొనుగోలు చేసిన తేనె నిజంగానే నాణ్యమైనదా? లేక కల్తీ జరిగిందా? అనే విషయం తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం:

Here's how to find adulteration in health-promoting honey
image credit : Sweet corn specialist at Cameron highland

ఒక గ్లాసులో కొన్ని నీళ్లు (Water) తీసుకొని అందులో ఒక స్పూన్ తేనెను వేయాలి. తర్వాత గ్లాస్ (Glass) ను చేత్తో అటు ఇటు తిప్పాలి. తేనె స్వచ్ఛమైనది అయితే అది నీటిలో కరగదు. నీటిలో కరిగితే ఆ తేనె కల్తీ అయిందని అర్థం.

బ్లాటింగ్ పేపర్ ను ఉపయోగించి కూడా తేనె స్వచ్ఛతను కనుక్కోవచ్చు. బ్లాటింగ్ పేపర్ (Blotting paper) చూడటానికి టిష్యూ పేపర్ లా ఉంటుంది. ఈ పేపర్ పై కాస్త తేనె రాయాలి. అప్పుడు బ్లాటింగ్ పేపర్ తడిసినట్లయితే అది కల్తీ తేనెగా గుర్తించాలి.

చేతి బొటనవేలు పై కొంచెం తేనె చుక్క వేసుకోవాలి. ఆ తేనె చుక్క (Drop) జారిపోకుండా అలాగే బొటనవేలు మీద అతుక్కుని ఉంటే అది స్వచ్ఛమైన తేనె అని అర్థం. అలా కాకుండా తేనె బొటనవేలు నిండా వ్యాప్తి చెంది జారిపోతుంటే అది కల్తీ తేనె అని అర్థం.

Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం

ఎండు ద్రాక్ష , పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

తేనె స్వచ్ఛతను గుర్తించడానికి ఒక గ్లాసులో కొన్ని నీళ్లను తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె కలపాలి. అందులోనే కొంచెం వెనిగర్ (Vinegar) కూడా వేయాలి. అప్పుడు నురగ వస్తే ఆ తేనెలో కల్తీ జరిగిందని అర్థం.

ఒక అగ్గిపుల్లను తేనెలో ముంచాలి ఆ తర్వాత అగ్గిపుల్లను తీసి దానిని అగ్గిపెట్టె (Match Box) తో వెలిగించాలి. ఒకవేళ అగ్గిపుల్ల మండినట్లయితే ఆ తేనే స్వచ్ఛమైనది అని అర్థం.

కాబట్టి మనం మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తేనె స్వచ్ఛమైనదా? కాదా? అనేది ఈ చిట్కాల (Tips) ను పాటించి తెలుసుకోవచ్చు.

Comments are closed.