Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రాజ్ కావ్య మధ్య జరుగుతున్న గొడవలో రాజ్ భార్యగా ఎందుకు పనికి రాదో చెబుతాడు. ఆ కారణాల వల్ల నువ్వు నా భార్యగా పనికిరావు అని అంటాడు. నువ్వు అప్పలమ్మ లాగా ఉంటావు. ఎప్పుడూ వాదిస్తూ ఉంటావు. నీదే పైచేయి కావాలని అనుకుంటావు అని నాలుగు కారణాలు చెబుతాడు.
కళ్యాణ్ శోభనం గోల..
ఇంట్లో వాళ్ళు అందరూ కావ్య ఆఫీసులో ఎలా పని చేస్తుంది అనే విషయంపై మాట్లాడుకుంటున్నారు. కావ్య ఆఫీసులో మంచిగా పని చేస్తుందని, కావ్య వేసే డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయని అందరూ అనుకుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి భర్తని చులకన చేసి మాట్లాడుతుంది. ఇక ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య నలుగురిలో ఉన్నప్పుడు భర్తని చులకన చేసి మాట్లాడకూడదు అనే విషయం తెలీదా అని తిడుతుంది.
ఇంతలో కళ్యాణ్ వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారనుకుంటా? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నారా? అని అడిగాడు. కళ్యాణ్ నాన్న అదేంలేదు రా కవిపుత్ర, మా అమ్మ మీ అమ్మకి కొంచం గడ్డి పెట్టింది అని చెప్పాడు. ఈ మధ్య మమ్మీ రుద్రాణి అత్తయ్య దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటుంది డాడీ అని కళ్యాణ్ అన్నాడు.
Also Read : Brahmamudi serial feb 1st episode : ధాన్యలక్ష్మి పై అరిచిన కావ్య.. రాజ్ ని నిలదీసిన కావ్య
ఆ తర్వాత పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు కళ్యాణ్. తాతయ్య మీ రోజుల్లో 5 రోజుల పెళ్లి జరిగింది కదా అని కళ్యాణ్ అడిగాడు, అయితే అవును జరిగింది, 7 రోజుల పెళ్లి కూడా జరిగేది అని చెప్పాడు తాతయ్య. అయితే శోభనం ఎప్పుడు జరిగేది అని కళ్యాణ్ అడుగగా, ముహూర్తం లేకపోతే ఒక సంవత్సరం వరకు కూడా కార్యం జరగదు అని అందరూ చెప్పారు. వామ్మో సంవత్సరం దాక ఆగాలా అని కళ్యాణ్ అన్నాడు. ముహూర్తం లేల్కపోతే అంతేరా అని అందరూ అన్నారు. తర్వాత, మీ శోభనానికి పెద్దమ్మ ముహూర్తం పెట్టించింది అని కళ్యాణ్ తో చెప్పారు.
శోభనం ఆపే ప్రయత్నంలో అనామిక..
అనామిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి శోభనం గురించి చెబుతుంది. ఇక వాళ్ళ అమ్మ శోభనం ఆపే ప్లాన్ ఒకటి చెబుతుంది. ఇంతలో అప్పు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె తన కూతురు కిడ్నాప్ అవ్వడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది ఏంటి అని అప్పు అడిగి ఆమెకి సహాయం చేయాలని చూస్తుంది.
రాజ్ భార్యగా అర్హత పొందేందుకు కావ్య ప్రయత్నం..
ఇప్పటి నుండి రాజ్ భార్యగా అర్హత పొందేందుకు కావ్య ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి నుండి రాజ్ కి నచ్చినట్టుగా రాజ్ మెచ్చినట్టుగా ఉండాలని కావ్య నిర్ణయం తీసుకుంటుంది. ఇక అది రేపటి నుండి అమలు చేస్తుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…