Brahmamudi serial feb 1st episode : ధాన్యలక్ష్మి పై అరిచిన కావ్య.. రాజ్ ని నిలదీసిన కావ్య

రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ధాన్యలక్ష్మి పై అరిచిన కావ్య..

అనామిక కావ్య దగ్గరికి వచ్చి కళ్యాణ్ కోసం వంట చేయమని అడుగుతుంది. నాకు ఓపిక లేదు అనామిక ఇప్పుడు చేసే మూడ్ కూడా లేదు అని చెబుతుంది. అర్ధం చేసుకోమని అనామికకి చెబుతుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏంటి నా కోడలి మీద అరుస్తున్నావ్? ఒక్కరోజు ఆఫీసుకు వెళ్లి రాగానే అహంకారం పెరిగిపోయిందా? అంటూ కావ్యని తక్కువ చేసి మాట్లాడింది.

నేను ఒక వంటలక్కని అయిపోయాను, ఇంట్లో పనిమనిషిని అయ్యాను. నాకు వండి పెట్టాల్సిన అవసరం లేదని కావ్య ధాన్యలక్ష్మి పై గట్టిగా అరిచి చెబుతుంది. నీకు ఎంత దైర్యం అని ధాన్యలక్ష్మి అంటుండగానే అపర్ణ ధాన్యలక్ష్మి పై విరుచుకుపడుతుంది. వంట నీ కోడలు చేయాలి? చేయడం రాకపోతే నువ్వు దగ్గర ఉండి నేర్పించుకో అని అపర్ణ ధాన్యలక్ష్మికి చెబుతుంది. కావ్య ని రెస్ట్ తీసుకోమని చెబుతుంది.

guppedantha-manasu-serial-feb-1st-episode-kavya-who-shouted-at-dhanyalakshmi-kavya-who-stood-up-to-raj

కళ్యాణ్ కావ్యకి చెప్పిన మాటలు.. 

కావ్య ఏడుస్తూ కూర్చుంది. కళ్యాణ్ చూసి ఏదో జరగకూడనిది జరిగింది అని అర్ధం అయింది వదిన. ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. కావ్య జరిగింది చెబుతుంది. అక్కడ నిలదీయకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావా అని అన్నాడు. మరి ఏం చేయాలి కవి గారు అని కావ్య అడిగింది. ఇప్పుడు అన్నయ్య ఆఫీసు నుండి వస్తాడు. నిలిదీసి అడుగు వదిన అని చెప్పి వెళ్తాడు.

రాజ్ ని నిలదీసిన కావ్య..

రాజ్ రాగానే కళ్యాణ్ కోపం గా మాట్లాడి వెళ్తాడు. ఇక గదిలోకి రాగానే డోర్ వేస్తుంది కావ్య. ఎక్కడికి వెళ్లారు? ఆఫీసు పని చెప్పి ఎటు వెళ్తున్నారు? ఎవరిని కలవడానికి వెళ్తున్నారు అని అడుగుతుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రాజ్ కావ్యతో చెబుతాడు. నేను మీ భార్యని నాకు చెప్పే హక్కు ఉంది. అని కావ్య అంటుంది. అసలు నిన్ను భార్యగానే చూడలేదు అని అంటాడు రాజ్. అది మీరు చెప్పడం కాదు. మీరు తాళికట్టినప్పుడే నేను మీ భార్యని అయ్యాను, మీరు ఒప్పుకోకపోతే దానికి నేనేం చేయలేను అని అంటుంది. అయినా నన్ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో కారణం చెప్పమని అడుగుతుంది. రాజ్ కారణాలు చెప్తా అని అంటాడు. మరి ఆ కారణాలు ఏంటో చూడాలి.

Comments are closed.